సంఘమిత్రకు బ్రేకులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి స్ఫూర్తితో ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ చిత్రంగా సంఘమిత్రను మొదలుపెటిటన విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్ ఫిలింస్ పతాకంపై ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రంలో టైటిల్ రోల్‌కు శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. కొన్నాళ్లు ట్రైనింగ్ ఇచ్చి పది రోజులపాటు షూటింగ్ జరిగిన తరువాత శృతిహాసన్ సినిమా నుండి తప్పుకోవడంతో అసలు సమస్య అక్కడే మొదలైంది. శృతి స్థానంలో ఎవరు నటిస్తారన్న విషయంలో పలువురి హీరోయిన్ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. తాజాగా హన్సిక పేరుకూడా వినిపించింది. కానీ హన్సిక చేయనని చెప్పడంతో నిరాశపడిన దర్శకుడు ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సినిమా విషయంలో ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో, తాను గతంలో తీసిన కల కలప్ప చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం అంజలి, ఓవియాలను ఎంచుకున్నాడని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని టాక్. సుందర్ వేరే సినిమా పనిలో బిజీగా వుండడంతో సంఘమిత్రకు బ్రేకులు పడ్డట్టేనని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.