ట్రెండ్ మారుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకుల ట్రెండ్‌ను సెట్ చేసేవి సినిమాలే. ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలతోపాటుగా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు రూపొందించడంలో టాలీవుడ్ ముందువరుసలోనే వుంటోంది. సహజంగా ఏ చిత్రంలో అయినా హీరో ఇంట్రొడక్షన్ అదిరిపోయే లెవెల్‌లో వుండాలన్న భావన ఇప్పుడు పలుచబడిపోయింది. గత సంవత్సరం వరకూ హీరో కనపడిన వెంటనే ఓ ఫైట్‌తోపాటుగా ఓ పాటను కూడా పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. హీరో కారెక్టర్ ఏంటో ఆ పాట చెబుతుందన్నమాట. ఆ తరువాత కథలోకి వెళ్లడం, నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, ఆరు ట్విస్టులు, క్లైమాక్స్‌తో సినిమా ముగిసిపోతుంది. ఇక్కడ కథానాయిక ఎక్కడా అంటే, ఎక్కడోచోట ఉంటుందిలే అన్న భావనే గతంలో సినిమా పరంగా వినిపించేది. కథానాయిక ప్రాధాన్యత వున్న సినిమాల్లోనే హీరోయిన్‌కు సరైన పాత్ర లభించేది. హీరోయిజమ్ డామినేట్ చేసే కథల్లో హీరోయిన్ కేవలం పాటలకు కథానాయకుడితోపాటుగా నాలుగు స్టెప్పులేయడానికే సరిపోయేది. గ్లామర్ ప్రదర్శనకు మాత్రమే హీరోయిన్ పాత్రలు కనిపించేవి. ఈ ట్రెండ్ ఇప్పుడు మారుతోంది. హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు దాదాపు తగ్గిపోయాయి. అయితేనేం, హీరోయిన్ పాత్రకు మాత్రం ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పుడు ఫ్యాషన్ ఏమిటంటే, హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఎలా ఉండబోతోందీ అన్నదే ప్రధానంగా సాగుతోంది. హీరోయిన్ కనపడగానే ఓ పాటో, లేక మంచి సన్నివేశమో వుండేలా దర్శక నిర్మాతలు ఆయా కథనాలు రాసుకుంటున్నారు. హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదనే ఫిర్యాదు ఇప్పుడు మరుగున పడిపోతోంది. తెరపైన హీరోయిన్ పాత్ర ప్రధానమైన అంశంగా మారుతోంది కథనంలో. కథానాయకుడికి ధీటుగా కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువగా హీరోయిన్లు తెరపై హంగామా చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ అన్నమాట దాదాపు మరుగున పడిపోయింది. కొత్తగా వస్తున్న కథానాయికలు కూడా తొలి చిత్రాలతోనే హీరోయిన్ హంగామాతో కన్పిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కొత్తగా వస్తున్న అమ్మాయిలకు మంచి పాత్రలే దొరుకుతున్నాయి. ఇదంతా కొత్తగా రాసుకుంటున్న కథలలో వున్న సంక్లిష్టత మాత్రమే. దీనికితగ్గట్టుగా హీరోలు కూడా కథానాయికల విషయంలో పట్టుదలలకు పోవడంలేదు. ప్రేక్షకులకు కావలసింది వినోదమే కనుక అది కూడా గ్లామర్‌తో కూడిన వినోదం కనుక, హీరోయిన్లపై ఎక్కువ బాధ్యతను మోపే ప్రయత్నానికి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అయితే, పూర్తి స్థాయిలో ఓ పాత్రను ఫలానా హీరోయిన్ మాత్రమే చేయగ
లదు అన్న మాటకు మాత్రం ఇపుడు విలువలేదు. అనుష్క రుద్రమదేవి సినిమా విడుదలయ్యాక దాదాపు అలాంటి ధీరోదాత్తమైన ప పాత్రలుగాని, సమాజంలో మార్పుకోసం ప్రయత్నించే నాయికాపరమైన కథలుగాని కనపడడంలేదు. దాదాపుగా హీరో ఓరియెంటెడ్ కథలే వస్తున్నాయి. అయినా కానీ హీరోయిన్ ప్రాధాన్యత ఉండడం ఓ శుభసూచకమే. ఎందుకంటే, రెండు పాత్రలమధ్య సంక్లిష్టతలు వున్నపుడే ఆ కథలో పట్టు, కథనంలో కనికట్టు వుంటాయి. అది ప్రేక్షకుడికి నచ్చుతాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ గొప్ప నటి అని నిరూపించేందుకు ఇప్పటికి ఒక్క సినిమా కూడా రాకపోయినా, మహానటి సావిత్రిపై రూపొందిస్తున్న బయోపిక్‌లో నటిస్తోంది. ఈ పాత్రలో ఆమె ఎంతవరకు ఒదిగి నటిస్తుందో చూడాల్సిందే. అలాగే ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ఫిదా చిత్రంతో సాయిపల్లవి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆమె నృత్యాలకు, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అర్జున్‌రెడ్డి చిత్రంతో షాలిని పాండే కూడా మంచి మార్కులే తెచ్చుకుంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ టాప్ స్టార్‌గా వున్నా, కాజల్, నివేదా థామస్, రితికాసింగ్ లాంటివాళ్ళ కాల్షీట్లకోసం డిమాండ్ కొనసాగుతూనే వుంది.
ఇలా గతంలో లేని విధంగా టాలీవుడ్‌లో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. కథానాయిక ప్రాధాన్యం వున్న కథలు రాకపోయినా, పాత్రలు మాత్రం సరికొత్త తరహాలో డిజైన్ అవుతూ ప్రేక్షకుడికి కొత్త అనుభూతి అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో ఇటువంటి మార్పులు ప్రేక్షకులు గమనించారు. ఈ కొత్త మార్పు ఎంతకాలం హవా కొనసాగిస్తుందో, హీరోల సహనం ఎంతకాలం వుంటుందో వేచి చూడాల్సిందే!

- శేఖర్