అర్జున్‌రెడ్డిపై ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న అర్జున్‌రెడ్డి చిత్రం పలు వివాదాలతోపాటు మరోవైపు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి పొగిడేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రీమేక్ రైట్స్‌కోసం భారీ పోటీ నెలకొంది.
సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ హక్కుల్ని హీరో ధనుష్ తీసుకున్నాడు. ఆయన స్వంత బ్యానర్ వండర్‌బార్ ఫిలింస్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. అయితే ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి పాత్రలో ధనుష్ నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి వుంది. ముఖ్యంగా ఈ పాత్రపై ధనుష్ ఆసక్తిగా వున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.