మంచి నటిగా నిరూపించుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ హీ రోగా నటిస్తున్న మేడమీద అబ్బాయి చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది మలయాళీ భామ నిఖిలా విమల్. ప్రజిత్ దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ నిఖిలా విమల్ చెప్పిన విశేషాలు..
అవకాశం..
చిన్నప్పటినుంచి సినిమాల్లో చేస్తున్నాను. 8వ తరగతిలో ఉన్నప్పుడు భాగ్యదేవర అనే మలయాళ సినిమాతో బాలనటిగా పరిచయం అయ్యాను. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించాను. తాజాగా తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తున్నాను. మలయాళ దర్శకుడు ప్రజిత్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించాడు.
బిన్నమైన పాత్ర..
ఇందులో నేను పక్కింటి అమ్మాయిగా కనిపిస్తాను. చలాకీగా యాక్టివ్‌గా వుంటే అమ్మాయి అయినా అందులో మరో కోణం వుంటుంది. అదేంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగులో నాకు మంచి గుర్తింపు వస్తుంది.
నరేష్‌తో ..
నరేష్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా సెట్స్‌లో చాలా సపోర్టుగా నిలిచాడు. నాకు భాషా సమస్య రాకుండా చూసుకున్నాడు. నరేష్‌లో మంచి పాషన్, సినిమా అంటే ఇష్టం కనిపించింది.
సినిమా గురించి..
ఇది కామెడీ చిత్రమే అయినా, అన్ని రకాల అంశాలున్నాయి. ముఖ్యంగా సెకెండాఫ్‌లో వున్న ట్విస్టు ఈ సినిమాకు ప్రధానాకర్షణ. మరోవైపు ఆడియో, ఫొటోగ్రఫి సినిమాకు పెద్ద సపోర్టుగా నిలుస్తాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.
నా గురించి..
నేను మలయాళి అమ్మాయిని. బిఎస్సీ పూర్తయింది. ఎమ్మెస్సీలో జాయిన్ అయిన సమయంలో ఈ అవకాశం వచ్చింది. అమ్మ డాన్సు టీచర్. చిన్నప్పటినుంచి సినిమాలంటే ఆసక్తి. గ్లామర్ పాత్రల్లో కాకుండా నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం తమిళంలో రంగ అనే చిత్రంలో చేస్తున్నాను. దాంతోపాటు మలయాళంలో మరో సినిమా వుంది. తెలుగులో మోహన్‌బాబుతో కలిసి గాయాత్రి సినిమా చేస్తున్నాను. ఇది తండ్రీ కూతుళ్ళ అనుబంధంతో తెరకెక్కుతుంది.

- శ్రీ