డబ్బింగ్‌లో సునీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన టూ కంట్రీస్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి దర్శక నిర్మాత ఎన్.శంకర్ వివరాలు తెలియజేస్తూ- మలయాళంలో సూపర్‌హిట్ అవ్వడమే కాకుండా రికార్డు స్థాయిలో భారీ వసూళ్లను దక్కించుకున్న టూ కంట్రీస్ సినిమా రీమే క్ ఇది. సునీల్‌కు సరిగ్గా సరిపోయే కథ. కొత్త సునీల్‌ను చూస్తారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామన్నా రు. సంగీతం:గోపీసుందర్, కెమెరా:సి. రాంప్రసాద్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్. శంకర్.