104 బ బోయపాటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన పైసా వసూల్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు తన 102వ చిత్రంగా ప్రముఖ తమళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సిలో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. దాంతోపాటు తన 103, 104 సినిమాలపై దృష్టిపెట్టాడు బాలయ్య. ఇప్పటికే పూరి జగన్నాధ్‌తో మరో సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే ఆయన 104వ చిత్రంగా బోయపాటి శ్రీనుతో సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వీరిమధ్య చర్చలు జరిగాయని టాక్. సింహ, లెజెండ్ వంటి సినిమాలతో బాలయ్య కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రాల్ని అందించిన బోయపాటితో చేసే హ్యాట్రిక్ సినిమా ఇది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి.