బాలీవుడ్ కాటమరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు చిత్రం ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లనుంది. సరికొత్త గెటప్‌లో పవన్ తన ఫ్యాన్స్‌ని ఖుషీ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్. తమిళంలో వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అయితే కొన్ని మార్పులు చేసి కాటమరాయుడుని తెరకెక్కించారు. ఇప్పటికే భిన్నమైన సినిమాలతో ఖాన్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్న అక్షయ్‌కుమార్, తాజాగా టాయ్‌లెట్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టి కాటమరాయుడుపై పడిందట. ఇప్పటికే రీమేక్ హక్కులను స్వంతం చేసుకున్నాడని, త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వస్తుందట. మరి కాటమరాయుడిగా హిందీ ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి!