ఏప్రిల్‌లో మహేష్-మురుగదాస్‌ల సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్‌బాబు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత మహేష్ నటించిన చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయట. ఏప్రిల్‌లో ప్రారంభించి, ఏకధాటిగా ఆరు నెలలపాటు షూటింగ్ జరిపి, దీపావళికి విడుదల చేయాలని మహేష్‌బాబు ప్లాన్ చేస్తున్నాడట. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ సినిమా ఒకేసారి మూడు భాషల్లో రూపొందనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌లో సమంత కూడా జాయినయ్యింది. మహేష్‌బాబు కెరీర్‌లో అత్యంత భారీగా మురుగదాస్ తెరకెక్కించే సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్‌మధు నిర్మిస్తున్నారట.