అంతర్జాతీయం

కఠిన నిర్ణయాలకు వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్, సెప్టెంబర్ 6: భారత ప్రయోజనాల పరిరక్షణకు ఎంతటి కఠిన నిర్ణయాన్నైనా తీసుకునేందుకు వెనుకాడేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దును గట్టిగా సమర్థించుకున్న ఆయన దేశ హితమే తమ లక్ష్యమని బుధవారంనాడిక్కడ భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. రాజకీయాలకంటే దేశ హితమే ముఖ్యమని భావించడం వల్లే తమ ప్రభుత్వం ఇలాంటి విస్తృత ప్రభావం కలిగిన నిర్ణయాలను తీసుకోగలిగిందని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై జరిగిన లక్ష్యిత దాడులను ఇటీవలే అమలు చేసిన చారిత్రక జిఎస్‌టిని కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇవన్నీ కూడా మూడేళ్ల పాలనలో తాము తీసుకున్న అతిపెద్ద, కఠిన నిర్ణయాలేనని తెలిపారు. మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్న రెండు లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని, నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా తాము పనిచేశామని, కొద్దిమంది అవినీతిపరుల చర్యలకు 125 కోట్ల మంది భారతీయులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది, అలాంటిది మాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అని 35 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో మోదీ తెలిపారు. అసలు నల్లధనం ఎక్కడినుంచి వస్తోంది, ఎక్కడినుంచి పోతోంది అన్నదానిపై ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్న మోదీ పెద్దనోట్ల రద్దు అన్ని విధాలా సరైన నిర్ణయమేనని గట్టిగా సమర్థించుకున్నారు.
చిత్రం.. యాంగాన్‌లోని భారతీయులతో కరచాలనం చేస్తున్న మోదీ