విజయవాడ

పుస్తకాలు చెదలు పట్టకుండా ప్రజలకు చేరువ చేయండి! (విజ్ఞాపన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పదవిని వెంటనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరిరోజుల్లో చైర్మన్ పదవీకాలం ముగియటంతో గత నాలుగేళ్లుగా రచయితల నుంచి గ్రంథాలయాలకు పుస్తకాలు కొనే ప్రక్రియ నిలిచిపోయిందని వారన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రచయితలు తమ సొంత ఖర్చులతో రచనలను ప్రచురించుకుంటే ఆయా పుస్తకాలు ప్రజలకు చేరువకాక వృథాగా పడి వుంటున్నాయన్నారు. చైర్మన్ పదవి భర్తీ కానందున కోల్‌కత్తాలోని రాజారామమోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థకు రావలసిన కోట్లాది రూపాయల నిధులు మురిగిపోతున్నాయన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర గ్రంథాలయ సంస్థకు వెంటనే చైర్మన్‌ను నియమించాలని వారు కోరారు. అలాగే స్థానిక సంస్థలు ప్రజల నుంచి ఇంటి పన్ను రూపంలో జతకలిపి వసూలు చేసే లైబ్రరీ సెస్ కోట్లాది రూపాయలు గ్రంథాలయ సంస్థలకు విడుదల చేయటం లేదని వారు వాపోయారు. దీనివల్ల ప్రజల్ని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన గ్రంథాలయాల పరిపాలన కుంటుపడటంతో పాటు రచయితల పుస్తకాల కొనుగోళ్లకు ఇది అవరోధంగా మారిందన్నారు. ఫలితంగా ప్రజలకు చేరవేయాల్సిన పుస్తకాలు చెదలు పట్టి పోతున్నాయని వాపోయారు. ఈ విషయాలను స్థానిక సంస్థలు గుర్తించి నిధుల బకాయిలు వెంటనే విడుదల చేసి సమాజానికి దిశానిర్దేశం చేసే రచయితలకు చేయూత అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం తరపున సోమేపల్లి వెంకటసుబ్బయ్య, చలపాక ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.