విశాఖ

సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల ముందుకే అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, సెప్టెంబర్ 25: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ప్రజల వద్దకే పంపుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలో వాడచీపురుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమానికి 18 గంటల పాటు పూర్తిగా పని చేస్తూ అధికారులతో పని చేయిస్తున్నారన్నారు. అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో సైతం పనులను చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల నేరుగా ప్రజలకు అందుతున్నాయో లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలతో పాటు భవిష్యత్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలను గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో నిరుపేద కుటుంబంలో ఆడ పిల్లల వివాహానికి 30వేల రూపాయలను ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
స్కిల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్వాసిత యువకులకు తర్ఫీదు ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిరంతం ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాన్ని అందాలన్నారు. రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడం జరుగుతుందన్నారు. చంద్రన్న భీమా పథకం నిరుపేద కుటుంబాలకు ఒక ఆసరాగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు సైతం చంద్రబాబు ప్రవేశ పెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పరవాడ మండలాధ్యక్షులు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ పయిల జగన్నాధరావు, టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండారు అప్పలనాయుడు, మండల టీడీపీ అధ్యక్షులు బొండా సన్నిదేముడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.