పరుగుల రాణీగా..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్లో బయోపిక్ చిత్రాల హవా ఇంకా తగ్గలేదు సరికదా పెరుగుతూనే వుంది. దాని కి కారణం అటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించడంతోపాటు మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో దర్శక నిర్మాతలు ఈ తరహా సినిమాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు బయోపిక్‌లు బాలీవుడ్లో సంచలన విజయాలను అందుకున్నాయి. తాజాగా మరో బయోపిక్ సిద్ధమవుతోంది. దేశం గర్వించేలా పరుగుల రాణీగా గుర్తింపు తెచ్చుకున్న పి.టి.ఉష జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రేవతి తెరకెక్కించనుందని టాక్. పి.టి.ఉష పాత్రలో బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా నటిస్తుందట. ఇదివరకే మేరికోమ్ బయోపిక్‌లో ప్రియాంక నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ ఇమేజ్ తెచ్చుకున్న ప్రియాంకతో తెరకెక్కించే ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందిస్తారట. మరి పరుగుల రాణీగా ప్రియాంక సరైన న్యాయం చేయనుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తాడని, త్వరలోనే సెట్స్‌పైకి రానున్నట్టు తెలిసింది.