ఎప్పుడూ ఆమేనా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/28c1_9.jpg?itok=jZF5HzUY)
గ్లా మరస్ క్వీన్ శ్రీదేవి తన కుమార్తెను పరిశ్రమకు పరిచయం చేయడానికి తొందరపడుతోంది. ఇన్నాళ్లుగా కుమార్తె జాన్వి తాను సొంతంగా తన ప్రయత్నాలు చేసుకునే సమయంలో అడ్డుపుల్ల వేసిన శ్రీదేవి, ఇప్పుడు తన కూతురును ఎప్పుడెప్పుడు పరిచయం చేయాలా అని ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తనకిష్టమైన దర్శకుడు కరణ్ జోహార్పైనే కుమార్తె సినిమాకు సంబంధించిన విషయాలను అప్పగించింది. ఎప్పుడైనా సరే మంచి కథతో సినిమా తీయమని చెప్పడంతోపాటుగా, మరాఠీలో విజయవంతమైన సైరత్ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసింది. కానీ కరణ్ జోహార్ మాత్రం జాన్విని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీదేవి. ఆయన ఎప్పుడు ట్విట్టర్లలో ట్వీట్స్ చేసినా అలియాభట్ గురించే చేస్తున్నాడట. అలియాభట్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చి, తన కుమార్తె జాన్విని పట్టించుకోకపోవడం శ్రీదేవి కోపానికి కారణమవుతోంది. ఎప్పుడు అలియాభట్‌నే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. సో.. ఈ నేపథ్యంలో త్వరలో జాన్వి చిత్రం సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని ముంబై మీడియా వ్యాఖ్యానిస్తోంది.