ఇక నిర్మాతగా కూడా..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సొట్ట బుగ్గల తాప్సీకి బాలీవుడ్ వర్కవుట్ అయింది. సౌత్‌లో ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్, సక్సెస్ కేవలం రెండు మూడు సినిమాలతో హిందీలో అందుకుంది. అటు నటిగాను, ఇటు గ్లామర్ భామగాను ఇమేజ్ తెచ్చుకున్న తాప్సీ ఫోకస్ ఇప్పుడు గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకునే విషయంపై పడింది. అందుకే హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చగొట్టేందుకు సిద్ధం అయింది. తాజాగా తాప్సీ బాలీవుడ్‌ని భయపెట్టేందుకు సిద్ధం అయింది. తెలుగులో ఈమధ్యే విడుదలైన ‘ఆనందోబ్రహ్మ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెనె్నల కిశోర్‌లు నటించిన ఈ సినిమా సూపర్‌హిట్ అవడంతో ఇప్పుడు ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయాలనీ తాప్సీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్నట్టు ఈ సినిమాకు తాప్సీ నిర్మాతగా మారనుందట. తెలుగులో కూడా ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో ఇన్వాల్వ్ అయిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ కోసం నిర్మాతగా మారింది. మొత్తానికి సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది ఈ బ్యూటీ. మరి తాప్సీ భయపెడితే బాలీవుడ్ ప్రేక్షకులు భయపడతారా లేదా అన్నది చూడాల్సిందే.