విలన్.. అహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 February 2016
ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్ పతాకంపై పి.సత్యనారాయణరెడ్డి నిర్మిస్తున్న ‘అహం’ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. నూతన కథానాయకుడు నటించనున్న ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు రాజశేఖర్ నటిస్తున్నాడు. తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఆయన నటించిన ‘పట్టపగలు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గడ్డం గ్యాంగ్’ తర్వాత రాజశేఖర్ కెరీర్ డీలా పడింది. దాంతో కొంత గ్యాప్ తీసుకొని విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. రాజశేఖర్ సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించే ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ కెమెరామెన్.