వరంగల్

పల్లె ప్రగతికి రూ.54 కోట్ల ప్రత్యేక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 16: నర్సంపేట నియోజకవర్గంలో తాను త్వరలో చేపట్టబోయే పల్లె ప్రగతికి రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.54 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. పల్లె ప్రగతి సందర్భంగా శనివారం పట్టణంలోని రెడ్డి కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈసందర్భంగా పెద్ది మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలను తెలుకునేందుకు వీలుగా 51 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పార్టీ పరంగా తీసుకున్నట్టు చెప్పారు. ప్రతి రోజు మూడు గ్రామాలలోపల్లె ప్రగతి జరుగుతుందని, తొలుత గ్రామ కమిటీల నిర్మాణం, పార్టీ జెండా ఆవిష్కరణ, రచ్చబండలో ప్రభుత్వం ఇంటింటికీ అందించిన సంక్షేమ పథకాలను తెలియజేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఆయా గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని ప్రాధాన్యతా క్రమంలో అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 25 నుండి 50 లక్షల వరకు ప్రత్యేక నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. పల్లె ప్రగతిలో చేపట్టే అభివృద్ది పనులను పూర్తిగా గులాబీ కార్యకర్తలకే నామినేషన్‌పై ఇస్తామని వెల్లడించారు. నర్సంపేట నియోజకవర్గంలో దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ది పనులను టెండర్‌లో దక్కించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆ పనులను చేయకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అభివృద్ధి జరిగితే ఎక్కడ గులాబీ పార్టీకి మేలు జరుగుతుందోననే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని స్పష్టం చేశారు. అభివృద్ది పనులను ఎందుకు చేయడం లేదో కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల అభివృద్ది నిధులను ఎమ్మెల్యే దొంతికి ఇస్తే 30 కోట్ల హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.
నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే రేవూరి మాట్లాడటం ఆయన హుందాతనానికి సరి కాదన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా పనిచేశారని, అయితే మిగిలిపోయిన పనులను ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. తాను ఈమూడేళ్ల కాలంలో 16వందల కోట్ల రూపాయల నిధులను తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఇదే సమయంలో ఏ రంగంలో అభివృద్ధి చేయలేదో దొంతి, రేవూరిలు చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతికి సంబంధించి ఆడీయో పాటలను పార్టీ రాష్ట్ర నాయకులు గాదరి బాలమల్లు, బోడకుంట్ల వెంకటేశ్వర్లులు ఆవిష్కరించారు.

షెఢ్యుల్ కులాలకు కేటాయించిన
నిధులు వారికే ఖర్చు చేయాలి
*జాతీయ షెడ్యుల్ కులాల కమిషన్ సభ్యుడు రాములు
నక్కలగుట్ట, డిసెంబర్ 16: షెడ్యుల్ కులాలకు చెందిన యువతీ, యువకులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఎస్సీ కాలనీల అభివృద్ది పరిచేందుకు ఎస్సీ సబ్‌ప్లాన్ కింద వివిధ శాఖలకు కేటాయించిన నిధులు తప్పని సరిగా వారికే ఖర్చు చేయాలని జాతీయ షెడ్యుల్ కులాల కమీషన్ సభ్యులు కె.రాములు అధికారులను కోరారు. శనివారం అర్బన్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన షెడ్యుల్ కులాల అభివృద్ది శాఖ అధ్వర్యంలో సమీక్షా సమాశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు కేటాయించిన భూములు, ప్రాజెక్టులు, ఇండ్లు, కాలనీల నిర్మాణం తదితర పనుల కోసం త్వరిత గతిన పూర్తి చేసి ఎస్సీలకు ఇవ్వాలని అన్నారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి మూడు ఎకరాల భూమిని కేటాయించాలని సూచించారు. ఎస్సీకాలనీలలో విద్యుత్తు, నీరు, రోడ్లు నిర్మాణాలు సరిగా ఉండేలా చూడాలని అన్నారు. తాను స్వయంగా కొండపర్తి గ్రామాన్ని సందర్శించి, అక్కడ ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టి తీసుకుని వచ్చానని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ అర్బన్ జిల్లాలో ఆరు మండలాలు పట్టణ ప్రాంతంలో ఉండడం వలన గ్రామీణ ప్రాంతంలోని మండలాలలో ప్రభుత్వం నిర్దేశించిన భూముల కొనుగోలులో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి సుధీర్‌బాబు, జిల్లా రెవెన్యూ అధికారి శోభ తదితరులు పాల్గొన్నారు.