తూర్పుగోదావరి

హోదాను గాలికొదిలేసిన టీడీపీ, వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాల్సిన టీడీపీ, వైసీపీలు, హోదాను గాలికొదిలేసి బీజేపీ భజన చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని అల్యూమినియం అసోసియేషన్ హాలులో ఆదివారం సీపీఎం 22వ నగర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో 6 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 35 లక్షల ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారన్నారు. మోదీ ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేశారని, కార్పొరేట్ శక్తుల కోసం పెద్ద నోట్లను రద్దు చేసి మరింత పెద్ద నోట్లను తీసుకువచ్చారని విమర్శించారు. స్విస్ బ్యాంకు నుంచి నల్లడబ్బును మూడేళ్లయినా మోదీ తీసుకురాలేకపోయారన్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం సీపీఎం, వామపక్షాలేనని పాలకులు భయపడుతున్నారని, అందుకే సీపీఎం నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారన్నారు. భూ బ్యాంకుల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని, మూడేళ్ల కాలంలో సీపీఎం అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, రైతులు, నిర్వాసితులు, అసంఘటితరంగ కార్మికుల పక్షంగా నిలిచిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తమ మత విశ్వాసాలను అందరిపైనా రుద్దేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రశ్నించేవారిని చంపించడం, వారిపై దాడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. పార్లమెంట్ మెట్లను ముద్దు పెట్టిన తర్వాత మోదీ పార్లమెంట్‌లో అనేక ప్రజా వ్యతిరేక బిల్లులను ఆమోదించుకున్నారని ఆరోపించారు. ఇటీవల మృతి చెందిన సిఐటియు నాయకుడు బీబీ నాయుడు నగర్‌గా మహాసభకు పేరు పెట్టారు. ప్రాంగణానికి పిబి ముత్తారావు పేరు పెట్టారు. ఈ మహాసభలకు అధ్యక్ష వర్గంగా పోలిన వెంకటేశ్వరావు, టి సావిత్రి, ఎన్ భీమేశ్వరరావు వ్యవహరించారు. అనంతరం కార్యదర్శి టి అరుణ్, కార్యదర్శివర్గ సభ్యులు టిఎస్ ప్రకాష్, రంగ, పవన్, తులసి, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ముందుగా పార్టీ జెండాను మిడియం బాబూరావు ఆవిష్కరించారు. మూడేళ్ల కాలంలో మృతి చెందిన పార్టీకి చెందినవారి పట్ల సభ సంతాపం వ్యక్తం చేసింది.