అదిలాబాద్

మావోలకు అవకాశం ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, డిసెంబర్ 17: ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసి, లంబాడా గిరిజనుల మద్య చెలరేగిన వివాదాన్ని మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు సంయమనం పాటిస్తూ వివాదం సద్దుమనిగేలా సహకరించాలని డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన హెలిక్యాప్టర్ ద్వారా కుమురంభీం ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద దిగి అందోళనలు చేలరేగిన ప్రాంతాలను పర్యవేక్షించారు. స్థానిక కుమురంభీం ప్రాంగణం నుండి ఎక్స్‌రోడ్డు వరకు, అదే విధంగా పట్టణంలో ధ్వంసమైన సేవాలాల్ ఆసుపత్రి, బార్ షాపులను పరిశీలించారు.
అనంతరం కుమురంభీం ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో అంతర్గత సమావేశం నిర్వహించారు. డిజిపి మహేందర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలో చెలరేగిన వివాదాలు మావోయిస్టులు తమకు అనుకూలంగా మలుచుకొని సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు సహకరించి వివాదం సద్దుమనిగేలా చూడాలన్నారు. ఈ వివాదం వెనక ఎవరెవరు ఉన్నారో వారు ఎంతటివారైన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు అమాయకులని, వారిని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఉద్యమాల్లో భాగస్వాములు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ వివాదాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలు మూతపడ్డాయని, విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని అన్నారు. ఏజెన్సీలో పూర్తిస్థాయిలో శాంతి భద్రతలు నెలకొనే వరకు తామంతా ఇక్కడే ఉంటామని అన్నారు. ఎవరైన రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పోలీసులు ఏజెన్సీ ప్రాంత ప్రజల సాంప్రదాయాలకు విలువనిస్తూ సహనంతో పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకరావాలని సూచించారు.