విశాఖ

పొదుపుతోనే పురోభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, జనవరి 19: ప్రతీ ఒక్కరూ పొదుపు చేయడం అలవర్చుకోవాలని స్థానిక గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్ సూచించారు. శుక్రవారం మంప పంచాయతీ పైడి పనుకు, తుమ్మల బంద గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పొదుపు చేయడం అలవర్చుకోవాలన్నారు. మన అవసరాలకు పోగా మిగిలిన సొమ్మును పొదుపు చేసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలని, రెండు ఖాతాలు ఉన్నవారు ఒక ఖాతాను రద్దు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నందున ఆథార్‌ను తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పింఛను పథకం ప్రవేశ పెట్టిందన్నారు. బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న ఎస్‌పీ ఐ భీమా పథకం, ఇతర పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు, రైతులు రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి కొత్త రుణాలను పొందాలన్నారు. బ్యాంకు మిత్రల సేవలను వినియోగించుకోవాలన్నారు. సర్పంచ్ రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బ్యాంకు మిత్ర సత్యనారాయణ, తులసి, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.