ముద్దుల్లో మునిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వాంటికో సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతోంది పీసీ. ప్రస్తుతం మనదేశంలోకంటే ప్రియాంక చోప్రాకు విదేశాల్లోనే అభిమానలు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు చెవి కోసుకునే రేంజ్‌లో పోగవుతున్నారు. పీసీ అందచందాలకు డ్రీమ్‌సాంగ్ వేసుకునే కుర్రకారు పెరుగుతోంది. ఓవైపు క్వాంటికో సీజన్ 3తో బిజీగా ఉన్న పీసీ, మరోవైపు హాలీవుడ్ సినిమాలతోనూ అంతే బిజీగా ఉంది. వీటితోపాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తోంది. అదంతా ఓ కోణం అయితే ఇప్పుడు పీసీ మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో పేరుతో ఈ భామ సాగిస్తున్న హాట్ హాట్ రొమాన్స్ ప్రపంచానికి షాకిస్తోంది. ఓ హాలీవుడ్ కథానాయికకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పీసీ రొమాన్స్ చేస్తోంది. ఇదివరకే బాత్రూమ్ రొమాన్స్ వీడియో లీకై సంచలనం సృష్టించింది. తాజాగా హాలీవుడ్ నటుడు, క్వాంటికో కోస్టార్ అలన్ పావల్‌తో రొమాన్స్‌తో జీవించేస్తోంది. ఇటీవలే లిప్‌లాక్ ఫొటోలు వీడియోలు బయటికి వచ్చాయి. పీసీనే స్వయంగా ఈ లిప్‌లాక్ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేస్తుండడం విశేషం.