విజయవాడ

విద్యార్థులకు శ్రీ సరస్వతీదేవి ఆశీస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 22: రానున్న సంవత్సర పరీక్షల్లో విద్యార్థులందరూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ‘విజరుూభవ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి అర్చకులు శ్రీ సరస్వతీదేవి అలంకారం చేశారు. జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ చదువుల తల్లి సరస్వతీదేవిని దర్శించుకుని ఆశీస్సులను పొందటానికి సోమవారం వేకువజాము నుండే విద్యార్థులు ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మనక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో విద్యార్థులు, భక్తులకు దివ్య దర్శనం ఇచ్చింది. జ్ఞాన ప్రదాయినీని దర్శించుకొని ఆశీస్సులను పొందటానికి స్కూళ్లు, కళాశాలలకు చెందిన విద్యార్థులు వేకువజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. పరీక్షల్లో విద్యార్థులందరూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ దుర్గగుడి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విజరుూభవ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని ఇన్‌చార్జ్ ఈవో వైవి అనూరాధ ప్రారంభించారు. అంతరాలయంలోని మూల విరాట్‌తోపాటు, ఉత్సవమూర్తికి సైతం శ్రీ సరస్వతీదేవి అలంకారం చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ఇంద్రకీలాద్రికి వచ్చి శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులోని శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో ఉన్న మూల విరాట్‌ను సైతం దర్శించుకొని ఆమె ఆశీస్సులను పొందారు. అలాగే దేవస్థానం అధ్వర్యంలో శ్రీ సరస్వతీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయంచారు. అమ్మవారి చిత్రపటం, పెన్ను, కుంకుమ ప్రసాదం, లడ్డూ ఒక ప్యాకెట్‌లో వేసి విద్యార్థులకు ఉచితంగా అందచేశారు. ఇన్‌చార్జ్ ఈవో ఆదేశాలతో సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు ఆధ్వర్యంలో అధికారి ఎన్ రమేష్ పర్యవేక్షించారు. దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసి వేకువ జామున 5గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. నగరానికి చెందిన పలువురు వీఐపీలు భారీగా పెన్నులు ఈకార్యక్రమం నిమిత్తం దుర్గగుడి అధికారులకు అందచేశారు. ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటలనుండి రాత్రి 9గంటల వరకు విద్యార్థుల రద్దీ కొనసాగింది.