రాజకీయాల్లోకి విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పలువురు సినీ తారలు రాజకీయ ప్రవేశం చేస్తూ రాజకీయాలకు గ్లామర్‌ను అద్దుతున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, జాతీయ నటుడు కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మరో హీరో విశాల్ కూడా ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా మరో హీరో వస్తున్నాడంటూ కోలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. ఆ హీలో ఎవరో కాదు- తమిళంలో స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చుకున్న విజయ్! విజయ్ గత ఎన్నికల సమయంలో బిజెపితో మంతనాలు కూడా జరిపాడని వార్తలు వచ్చాయి. విజయ్ రాజకీయ ప్రవేశం గురించి వచ్చిన వార్తలపట్ల ఆయన తండ్రి కూడా సానుకూలంగానే స్పందించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే విజయ్ అభిమానులు పలు అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా విజయ్ ప్రజాసంఘం పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి అందులో పలువురిని సభ్యులుగా చేర్చుకుంటున్నారట. ఇప్పటికే కొందరు అభిమానులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని, త్వరలోనే విజయ్ అధికారికంగా ప్రకటించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.