వరంగల్

ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్ల ద్వారా.. మెరుగైన వైద్యం అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు,జర్నలిస్టుల , పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణకోసం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌లలో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె.పద్మ అన్నారు. అవసరమైన పేషంట్లకు అనువైన వైద్య సేవలను త్వరితగతిన అందించడానికి వరంగల్ నగరంలో కార్పోరేట్ స్థాయి ఆసుపత్రులతో అనుసందానం కలిగించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. మంగళవారం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అవరణలోని వెల్‌నెస్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఈసందర్భంగా వైద్య సేవలు అందుతున్న తీరు, సౌకర్యాలు గురించి పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాలకు చెందిన వైద్యులతో ఆయా విభాగాలు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించి తగు సూచనలు చేసారు. వైద్య పరిక్షల నిమిత్తం వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లతో వైద్య సిబ్బంది మానవీయ కోణంలో స్పందించి వైద్య సేవలందించాలని కోరారు. వెల్‌నెస్ సెంటర్‌లో ఇఎన్‌టి యూరాలాజీకి సంబంధించిన వైద్యసేవలు త్వరలో ప్రారంభించటం జరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, బర్నింగ్, (ఒళ్ళు కాలిన), చాతి నొప్పి మొదలైన అత్యవసర చికిత్స కోసం స్థానిక కార్పోరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నామని, త్వరలో నగరంలోని కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వెల్‌నెస్ సెంటర్ ద్వారా రెఫర్ చేయబడిన పేషంట్లకు తగు వైద్యసేవలు అందించడానికి అవగహన కుదుర్చుకుని అనుసందానం చేసుకోబోతున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి వైద్య సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓరియెంటేషన్ కార్యక్రమంలో నిర్వహించనున్నట్లు సిఈవో పేర్కోన్నారు. ఈ కేంద్రాల ద్వారా రెఫర్ చేయబడిన పేషంట్లకు గుండె మార్పిడి, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, బోన్ మార్పిడి వంటి చికిత్సలు కూడా చేయించామన్నారు. వెల్‌నెస్ సెంటర్ ద్వారా రెకమండ్ చేయబడిన పేషంట్లు కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న ప్రభుత్వపరంగా తామే బిల్లు చెల్లిస్తామని తెలిపారు. హన్మకొండ వెల్‌నెస్ సెంటరలో అవసరం మేరకు వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారని ప్రతి రోజు సుమారు 400 నుండి 500 మంది ఔట్ పేషంట్లకు వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని ఆమె తెలిపారు. పేషంట్లకు అవసరమయిన మందులు లభ్యమయ్యేలా డ్రగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా టిఎన్‌జివో అధ్యక్షులు కోలా రాజేష్‌గౌడ్, టిఎన్‌జివో ప్రతినిధులు శ్యాంసుందర్, రామునాయక్, పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు వెల్‌నెస్ రాష్ట్ర సిఈవోను పద్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

త్యాగానికి ప్రతీక గిరిజనులు
సీఎం ప్రత్యేక సహాదారులు దేశపతి శ్రీనివాస్
పాలకుర్తి, ఫిబ్రవరి 20: బ్రతుకు తెరువు కోసం అడవుల్లో చెట్టు, పుట్టలు తిరిగి కాలం వెళ్ళదిసుకొనే లంబాడిల నుంచే విజ్ఞానం పుట్టిందని సీఎం ప్రత్యేక సహాదారులు, ప్రముఖకవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని దర్ధపెల్లి శివారు టీఎస్‌కే తండాలో తెలంగాణ వికాస్ సమితి, సద్గురు సేవాలాల్ ట్రస్టు ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 279వ జంయతి ముగింపు ఉత్సవాల్లో సీఎం ఓ ఎస్డీ దేశపతి శ్రీనివాస్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌కావులు పాల్గొని భోగ్ భండారో కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. సేవాలాల్ నైవెధ్యం, జొన్న రొట్టెలు గిరిజనులతో కలిసి తిన్నారు. బాంజారాల తీజ్ పండగ పుస్తకం, సీడీలను వారు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశం వికాస్ సమితి అధ్యక్షులు మాలోత్ భిక్షపతి అధ్యక్షత వహించగా దేశ్‌పతి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు ప్రకృతి ప్రేమికులని, భూమి, జీవాలను దైవంగా భావించి మొక్కుతారాన్నరు. సుందరమైన అలంకరణ బంజారులకై సొంతమని, బంగారంలో లేని వనే్న బంజారుల డ్రెస్‌లో ఉంటుందన్నారు. సహానం, త్యాగం, శక్తికి ప్రతీక గిరిజనులని చెప్పారు. సేవాలాల్ గిరిజన తెగలో పుట్టడం గర్వించదగ్గ విషయమాన్నరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నదిజాలల కోసం జరిగిందని, సేవాలాల్ కూడ నీళ్ళను పోదుపు చేసుకోవాలని చెప్పాడని గుర్తుచేశారు. కెసీఆర్ ప్రభుత్వం అధికారంలోని వచ్చకే దేవాదుల కాల్వల ద్వార చెరువులు నింపుతున్నట్లు, సమైక్య రాష్ట్రంలో మనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నరు. బమ్మెర పోతన, పాల్కురి సోమనాధుడు, వల్మీకిలు పుట్టిన గడ్డని, తెలంగాణ మొత్తం దర్శించుకోవల్సిన ప్రాంతమన్నారు. టీఎస్‌కే తండ నుండి దుబ్బతండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సీఎంను ఒప్పించి నిధులు మంజురీ చేయిస్తానాని హమి ఇచ్చారు.
బంజారలు సాంస్కృతిక వారదులు -ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణ సంస్కృతిక వారదులు బంజార లంబాడాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తన నియోజక వర్గంలో సేవాలాల్ మహారాజ్ గుడి ఉండడం అదృష్టమన్నారు. ప్రహారీ గోడ నిర్మాణం, సేవాలాల్ పాలరాతి విగ్రహానికి తన స్వంతం ఖర్చులతో చేయిస్తానని హామి ఇచ్చారు. గిరిజనులకు పెద్దల నుండి వారసత్వంగా వచ్చిన సంస్కృతి, సాంప్రదాయాలను కపాడుకోవాలని సూచించారు. గిరిజనులు విద్యలో బాలులకంటే బాలికలు వెనుక బడి ఉన్నారని, బాలికలను ప్రోత్సహించాలని కోరారు. రెండు నెలల్లో తండాలను పంచాయితీలుగా ప్రకటించేందుకు కేసీఆర్ నిర్ణయం తిసుకొన్నారని, రాబోవు ఎన్నికలు నూతన పంచాయితీలకు అనుగూణంగా జరుగుతాయన్నారు. తీజ్, సీత్ల గిరిజనుల పండుగలని, గిరిజన పూజారులకు వేతనం, బంజార భవనం నిర్మించాలని ప్రో భట్లు రమేష్ కోరారు. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతిక,సాహిత్య,సామాజిక కార్యక్రమలు తీసుకోని ప్రోత్సహించాలని గిరిజన నాయకులు ఎర్రోల్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, సర్పంచ్ జహ్నవి, ఎంపీటీసీ సుధ, డా. వెంకన్న, ఆలయ చైర్మెన్ మల్లు నాయక్, పూజారి మంగ్యనాయక్, రతన్‌సింగ్, నాయకులు యాకంతరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులతో దేశపతి, ఎమ్మెల్యే ఆట పాట
టీఎస్‌కే తండాలో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు హజరైన సీఎం ఒఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావులకు గిరిజన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. లంబాడి మహిళలతో ధీటుగా ఆట, పాటలతో స్టెప్పులేశారు. డీజె సౌండ్ హోరులో ఎమ్మెల్యే స్టెప్పులేస్తు ఉత్సాహపరిచారు.

సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి
అభివృద్ధి పనులపై ఎంపీ బూరనర్సయ్య సమీక్ష

జనగామ టౌన్, ఫిబ్రవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచి ఆ ఫలాలను అర్హులైన వారందరికీ అందే విధంగా చూడాలని భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్ కోరారు. జనగామ జిల్లాలో అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం జనగామ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు సంతృప్తి కరంగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు నెలల క్రిందట జనగామ మండలం చంపక్‌హీల్స్‌లో ప్రారంభించిన మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో కావాల్సిన వసతులను కల్పించామని అన్నారు. ఇప్పటివరకు వైద్యులు లేనందున వైద్య సేవలు సక్రమంగా అందడంలేదని, ప్రస్తుతం ఐదుగురు డాక్టర్లను కేటాయించడంతో ఇక ఆ ఇబ్బందులు ఉండవని అన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీలో ఏమాత్రం అశ్రద్ద వహించవద్దని కోరారు. అలాగే జనగామకు ఔటర్ రింగ్ ఏర్పాటుకోసం ప్రభుత్వానికి పంపిన ప్రతిపాధనలపై ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్నాడని అన్నారు. త్వరలో అందుకు సంబందించిన నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. జిల్లాలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రభుత్వం దృష్టిలో జనగామకు మంచి పేరు వచ్చిందని అన్నారు. అది ప్రజాప్రతినిథుల, అధికారుల సమన్వయంతోనే సాధ్యమైందని అన్నారు. కలిసి పనిచేస్తే ఎంతటి పనినైనా సాధించవచ్చనేందుకు ఇదొక మంచి ఉదాహారణ అని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో చేపట్టిన పనులను యుద్ద ప్రాతిపాధికన పూర్తి చేయాలని కోరారు. స్మశాన వాటికల ఏర్పాటుకోసం స్థలాన్ని సేకరించి వివరాలు తమకు తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇంఛార్జీ కలెక్టర్ అనితా రాంచంద్రన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిథులు, అధికారులు అభివృద్ధి పనుల అమలులో ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. నిజమైన వారందరికీ ప్రభుత్వ సేవలు అందచేసే బాధ్యత ఎక్కువ శాతం అధికారులపైనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వనేజాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ప్రజాప్రతినిథులు ఎజాజ్, జనార్దన్‌రెడ్డి, ఇల్లెందుల నవ్యశ్రీలు పాల్గొన్నారు.