Others

సిద్ధాంతాలనా.. విగ్రహాలనా.. వేటిని కాపాడాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని తాజాగా కొంతమంది ఆకతాయిలు ధ్వంసం చేశారు. తమిళనాట పెరియార్ విగ్రహం, పశ్చిమ బెంగాల్‌లో శ్యామప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ చర్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. విగ్రహాలను ఏర్పాటు చేసి వాటిని కాపాడి, సిద్ధాంతాలను మరిచే వారిని ఏమనాలి? మరి కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను తామే ధ్వంసం చేసుకుంటున్నారనడానికి కొన్ని వాస్తవాలు.. కొన్ని సంవత్సరాల పూర్వం..
1. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఉన్న ఓ అమాత్యుడు దేవాలయాన్ని సందర్శిస్తారు. తాను ముందు హిందువునని, బ్రాహ్మణుడినని ఆ తరువాతనే- తాను కమ్యూనిస్టునని చెప్పుకోవటం తనకు గర్వించదగ్గ విషయమని ప్రకటిస్తారు.
2. కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, దేవునిపై ప్రమాణం చేసి పదవీ స్వీకారం చేశారు.
3. కేరళ రాష్ట్రానికి చెందిన సిపిఎం అగ్రనేత ఒకరు దేవాలయాల వ్యవహారాల మంత్రిగా అర్చకుల శిక్షణ నిమిత్తం తాంత్రిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని నిశ్చయించారు.
4. పశ్చిమ బెంగాల్‌లోని కమ్యూనిస్ట్ అగ్రనాయకులు దుర్గాపూజ ఉత్సవాలకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభోత్సవాలు చేసి పాల్గొంటున్నారు.
5. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేవాలయ వ్యవస్థ పునరుద్ధరణ కోసం తీవ్రమైన కృషి చేయడమే కాకుండా, షాంఘై విశ్వవిద్యాలయంలో దేవాలయ నిర్వహణకు సంబంధించిన ఎం.బి.ఏ డిగ్రీని ప్రారంభించింది. ఈ ప్రయత్నం ప్రపంచంలోనే ప్రప్రథమ ప్రయోగం.
పై అంశాలన్నీ చదివి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారా? కమ్యూనిజానికి ఏవౌతోంది? ఎటు పోతోంది? అంటూ ఆశ్చర్యపోతున్నారా?
‘మతం-ప్రజలకు మత్తుమందు, మతం కల్పిస్తున్న అసహజ సంతోషం నుంచి వారికి విముక్తి కలిగించి, నిజమైన సంతోషాన్ని అందించాలనుకుంటే మతాన్ని నిర్మూలించక తప్పదు’
- కార్ల్ మార్క్స్
ఈ భావాల పునాదులపై ఉద్భవించిన కమ్యూనిస్టులను నిస్సందేహంగా నాస్తికులు అని భావించటం సహజం. మతపరమైన విశ్వాసం లేని వ్యక్తులైన కారణం చేత వారు మతానికి, మతపరమైన ఆచారాలకు, దేవాలయాలకు, వీటన్నింటికి సంబంధించిన ఇతర అంశాలకు వ్యతిరేకులు అనే భావంతోనే మనం ఉంటాం.
కార్ల్ మార్క్స్ అభిప్రాయాల ఆధారంగా కమ్యూనిస్టులైనటువంటి వారు, మత నిర్మూలనకు కావలసిన అన్ని చర్యలను చేపట్టవలసి ఉంటుంది. కానీ మొదట పేర్కొన్న అయిదు అంశాలు పూర్తి భిన్నమైన కథనాన్ని ఆవిష్కరిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కమ్యూనిస్టు అగ్రనాయకులు, దుర్గాపూజ సందర్భంగా ప్రారంభోత్సవాలలో పాల్గొనటానికి అంగీకరించపోతే, రాజకీయంగా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు గ్రహించాలి. దేవీపూజల నిర్వాహకులు తమ పార్టీ కార్యకర్తలనీ, తమకు ఓట్లు ఆర్జించి పెట్టి, నాయకుల వెన్నంటి ఉండేవారినీ వారు గుర్తించారు. కార్ల్ మార్క్స్ భావాలకు విరుద్ధంగా ఈనాటి ఆధునిక పోకడ - వారి మాటల్లోనే చెప్పుకోవాలంటే ‘మతపరమైన విశ్వాసమున్న వ్యక్తి మార్క్సిస్టు కావచ్చు. ఇందులో తప్పేమీ లేదు.’
ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం పతనానికి అనేక కారణాలుండవచ్చు. అందులో మతపరమైన అవసరాలతో కమ్యూనిజం సంధి కుదుర్చుకోలేక పోవటమే ప్రముఖమైన కారంగా భావించవచ్చు. బహుశా ఈ అవగాహనే భారతదేశంలో కనబడుతున్న, మారుతున్న ధోరణులకు కారణం కావచ్చు. రాజకీయాల్లో అవసరమేర్పడినపుడు అవకాశవాదం ముందుకు దూకుతుంది. సిద్ధాంతాలను వెనక్కి నెట్టివేస్తుంది. కమ్యూనిస్టులు, మతపరమైన అంశాలపై పునరాలోచనలో పడడం ఆహ్వానించదగ్గ పరిణామం. వారు తమ విశ్వాసాలను, పద్ధతులను పునస్సమీక్షించుకొని ఈ దేశ పరిస్థితులకనుగుణమైన ‘్భరతీయ బ్రాండ్ కమ్యూనిజా’న్ని ఆవిష్కరించడం కానీ లేక ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల కారణంగా, రాష్ట్రం వారీగా సిద్ధాంత రూపకల్పనకు పూనుకుంటున్నారేమో అనిపిస్తుంది. మార్పు ఒకటే నిరంతర సత్యం అనే సూత్రం ప్రకారం, క్రమ పరిణామమే సత్యం అనే సిద్ధాంతానుసారం విప్లవమే సంస్కరణకు సరియైన మార్గం అనే భావనతో, కాలం చెల్లిన వారి భావాలను ప్రక్కనపెట్టి ప్రజాబాహుళ్యంతో కలిసే ఆలోచనను ఆహ్వానించటం. ఆహ్వానించదగ్గ పరిణామంగానే అంతా భావించాలి.
ఇప్పుడు మనం భారతీయ కమ్యూనిస్టుల గురించి, మారుతున్న వారి వైఖరుల గురించి ఎందుకు ప్రస్తావించాలి? ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంలో ఇష్టమైన అభిప్రాయాన్ని ఎన్నుకోవడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనను మార్చుకోవటానికి వారికి స్వాతంత్య్రం ఉంది...
సమాజంలోని అణగారిన పక్షాల వైపు ఎల్లప్పుడూ తాముంటామని కమ్యూనిస్టులు అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోను, దేశంలోని ఇతర రాష్ట్రాలలో నేడు దేవాలయాల వ్యవస్థ అన్యాయంగా అణగదొక్కబడి పతనావస్థలో ఉంది. దేవాలయ చట్టాలలోని లొసుగుల ఆధారంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు చేసిన కబ్జాలను వివిధ రాష్ట్రాలలో ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌లు క్రమబద్ధీకరణ చేస్తున్నవి.
కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఈ మధ్యకాలంలో చేసిన ప్రకటనలు కోట్లాది భక్తుల మనస్సులను బాధించాయి. వీరి అభిప్రాయాలు భారతదేశంలోనే కాకుండా బయట ఉండే భక్తులను కూడా బాధించాయి.
సనాతన ధర్మంపై, భక్తితత్త్వంపై, దేవాలయ వ్యవస్థపై ఒక నిర్దిష్టమైన, స్పష్టమైన సిద్ధాంతం కమ్యూనిస్టులలో ఉండనంత వరకు, కోట్లాది మంది మనోభావాలను వారు గౌరవించనంతవరకు కమ్యూనిస్టులకు ఈ దేశంలో మనుగడ కష్టమే. ఎవరు ఎన్ని విగ్రహాలను ప్రతిష్ఠించినా సిద్ధాంతాలు మరిస్తే కాలగర్భంలో కలవడమే! ఇది నిజం..

C S Rangarajan 98851 00614