అంతర్జాతీయం

నీటి సంరక్షణ చర్యలపై భారత్‌కు ఐరాస ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 20: భారత్‌లో నీటి లభ్యతను పెంచేందుకు స్థానిక సమాజాలు చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో ప్రశంసించింది. కాగా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఐదు బిలియన్ ప్రజలకు తగినంత తాగునీటి లభ్యత ఉండదని ఐరాస పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రకృతి పరమైన పరిష్కారాలు ఎంతో ఉత్తమమైనవిగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక-2018 పేర్కొంది. ఈ నివేదికను బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచంలో అతిపెద్ద నీటి సంబంధ ఈవెంట్‌లో సోమవారం ఐరాస విడుదల చేసింది. ఈ సందర్భంగా చైనా వర్షపు నీరు రీసైక్లింగ్, భారత్‌లో అడవుల పునరుద్ధరణ, ఉక్రెయిన్‌లో కృత్రిమ తేమ నేలల సృష్టిని ఉదహరించింది. ‘‘నీటి వనరుల నిర్వహణపై ప్రపంచం దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇది అత్యంత అవసరం’’ అని యుఎన్ ఎడ్యుకేనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యక్షురాలు ఔడ్రే అజౌలే పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నీటికోసం డిమాండ్ అధికమవుతోందని, వచ్చే రెండు దశాబ్దాలకాలంలో ఇది మరింతగా పెరుగుతుందని ఆమె అన్నారు. జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, నీటి వినియోగ విధానాల్లో మార్పులే ఇందుకు కారణమన్నారు. రాజస్థాన్‌లోని తరుణ్ భరత్ సంఘ్, రాష్ట్రంలో స్థానిక నీటి సైకిల్స్‌ను, నీటి వనరులను పునరుద్ధరించడంలో స్థానిక ప్రజలకు మద్దతుగా నిలిచింది.