‘నిన్ను రోడ్డుమీద చూసినది..’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగార్జున కెరీర్లో పెద్ద హిట్ అయిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు’ అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్‌ను యువ సామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం ‘సవ్యసాచి’లో రీమిక్స్ చేస్తున్నాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాట రీమిక్స్‌లో చైతూతో ఓ అగ్ర కథానాయిక ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శక నిర్మాతలు. ఒరిజినల్ వెర్షన్‌ను కంపోజ్ చేసిన కీరవాణి ఈ రీమిక్స్ వెర్షన్‌కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.