విజయవాడ

ప్రభుత్వ పథకాల అమల్లో సాంకేతిక లోపాలుంటే చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను, ఇబ్బందులను నివేదిక రూపంలో అందించాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ లక్ష్మీకాంతం పౌర సరఫరాలు, ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో సాంకేతిక లోపాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. అయితే ప్రజల్లో సంతృప్తి స్థాయి ఆశించిన మేర లేకపోవడానికి సాంకేతిక లోపాలు ఒక కారణం అయి ఉండవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను నివేదిక ద్వారా అందిస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించవచ్చునన్నారు. తద్వారా సంతృప్తి స్థాయి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో అసలైన లబ్ధిదారులకు నేరుగా పథకాలు చేరేలా సాంకేతికతతో రూపొందించినప్పటికీ క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వ్యవసాయంలో రైతులకు రుణాలు, కౌలు, రైతులకు రుణాలు, ఆధార్ ఆధారిత ఎరువుల పంపిణీలో ఇబ్బందులు, ఉద్యోగుల బయోమెట్రిక్ ఇబ్బందులు, ఈ ఆఫీస్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, ఉపాధి హామీ పథక కూలీలకు చెల్లింపులు, శ్రీ శిశు సంక్షేమ శాఖలో అన్న అమృతహస్తం వంటి పథకాల్లో సాంకేతిక ఇబ్బందులు నివేదిక ద్వారా అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు, డీఆర్‌డీఎ పిడి చంద్రశేఖర్ రాజు, ఐసీడీఎస్ పిడి కృష్ణమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేడు గ్రామదర్శిని
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులతో ముఖాముఖి ద్వారా నేరుగా తెలుసుకునే గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఈ నెల 26న గురువారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లా అధికారులతో బస్సు యాత్ర ద్వారా తొలుత నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, కంచికచర్ల మండలంలో 2 గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను నేరుగా కలుసుకునేందుకే గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఉదయం 7.30 గంటలకు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని నగరపాలక సంస్థ, కంచికచర్ల మండలంలోని 2 గ్రామాల్లో పర్యటించి మధ్యాహ్నం నగరానికి చేరుకుంటామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా లబ్ధిదారుల నుండి తెలుసుకుని వాటిని సరిదిద్ది భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామదర్శిని కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.

రైతుబజార్‌లో విజిలెన్స్ తనిఖీలు
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 25: స్వరాజ్యమైదాన్‌లోని రైతుబజార్‌లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు బజారులోని స్టాల్స్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదులపై స్పందించిన విజిలెన్స్ ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో తూనికలు, కొలతలు శాఖ అధికారులతో కలిసి విజిలెన్స్ బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. ఆరు ప్రత్యేక బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. షాపుల్లోని ప్రభుత్వ గుర్తింపు కార్డు హోల్డర్స్‌ని ప్రశ్నించారు. రైతు బజారులో అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారన్న అభియోగంపై తనిఖీలు చేపట్టిన మీదట అధికారులు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపారులను కూడా గుర్తించి కేసులు నమోదు చేశారు. కూరగాయలను గ్రేడింగ్ చేసి బయట మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తనిఖీల్లో కొనుగొన్నారు. ఎలక్ట్రానిక్ కాటాలు కూడా సరిగా పని చేయడం లేదని గుర్తించి, షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈతరహా దాడులు నగరంలోని మిగిలిన రైతుబజార్లలో సైతం కొనసాగుతాయని అయితే ఆకస్మిక తనిఖీల గూర్చి ముందుగా ఎలాంటి సమాచారం ఉండదని ఈసందర్భంగా విజిలెన్స్ అధికారులు తెలిపారు.