అంతర్జాతీయం

మన స్నేహం ప్రపంచానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహన్, ఏప్రిల్ 27: భారత్-చైనాల మధ్య శతాబ్దాలుగా సాగుతున్న మైత్రీ బంధం ఇరుదేశాల సాన్నిహిత్యానికి దర్పణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర ముఖాముఖి చర్చలకు ముందు జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల సందర్భంగా మాట్లాడిన మోదీ ‘్భరత్ - చైనాలు ఎంతగా సన్నిహితమైతే అంతగా ద్వైపాక్షిక ప్రయోజనాలు నెరవేరతాయి. అదేవిధం గా ఈ రెండు దేశాల మైత్రీబంధం ప్రపంచ శాంతి అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది’ అని స్పష్టం చేశారు. నిర్దిష్టమైన అజెండా అంటూ ఏదీ లేకుండా చైనా అధ్యక్షుడుతో తాను జరపనున్న చర్చలు రెండు దేశాల సామరస్య బంధానికి సంకేతమని పేర్కొన్న మోదీ ఈ తరహా సమావేశాలు ఇరు దేశాల మధ్య ఓ సంప్రదాయం కావాలని స్ప ష్టం చేశారు. 2019లో ఇదే తరహా అజెండా లేని ముఖాముఖి భేటీని తాను జీ జిన్‌పింగ్‌తో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ జనాభాలో 40శాతం మందికి భారత్ - చైనాలు బాధ్య త వహిస్తున్నాయని, దీని దృష్ట్యా ఇరు దేశాల మధ్య ఎంతగా సాన్నిహిత్యం ఇనుమడిస్తే అంతగా స్వీయ ప్రయోజనాలు నెరవేరడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 2వేల ఏళ్ల ఇరు దేశాల చరిత్రను గుర్తు చేసుకున్న మోదీ 1600 ఏళ్ల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శక్తిని, ఊతాన్ని, ఉత్తేజాన్ని ఈ రెండు దేశాలు అందించాయనీ, అదే తరహాలో ప్రభావితం కూడా చేశాయని మోదీ తెలిపారు. 50శాతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిగివున్న భారత్ - చైనాలు శతాబ్దాలుగా తిరుగులేని శక్తితో రాణిస్తున్నాయని వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రాజధాని బీజింగ్‌లో కాకుండా మరో ప్రాంతంలో తనకు ఆహ్వానం పలకడమన్నది భారత ప్రజలకు ఎంతో గర్వంగా ఉందని మోదీ అన్నారు. ‘రెండుసార్లు మీరు బీజింగ్‌లో కాకుండా మరో ప్రాంతానికి వచ్చి నాకు ఆహ్వానం పలికారు. అలాంటి ఘనత పొందిన మొదటి భారత ప్రధానిని బహుశా నేనేనేమో’ అని ఈ సందర్భంగా వ్యా ఖ్యానించారు. భారత్ - చైనాల మధ్య ఇటీవలి కాలంలో భాగస్వామ్యం మరింత బలపడిందని, ఎంతో సానుకూల ప్రగతి సాధ్యమైందని జీ జిన్‌పింగ్ అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రెండు దేశాలు ఎంతో సాధించాయని, భారత ప్రధానితో తాను అనేక సందర్భాల్లో చర్చలు జరిపానని తెలిపారు. దాదాపు 2.6 బిలియన్ ఉమ్మడి జనాభా కలిగిన భారత్ - చైనాలకు అభివృద్ధి సాధించేందుకు అనంతమైన అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ రెండు దేశాల ప్రభావం పెరుగుతోందని, భవిష్యత్ పట్ల కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్న ఈ రెండు దేశాల నేతలు తరచూ సమావేశం కావడం ఎంతైనా అవసరమన్నారు. దీనివల్ల పరస్పర అవగాహన పెరుగుతుందని, ఎప్పటికప్పుడు మైత్రీ బంధాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకూ అవకాశం ఉం టుందని పేర్కొన్నారు.