అదిలాబాద్

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 17: కాంగ్రెస్ పాలనలో ప్రజలు అడుగడుగునా పాపాలు మోసాలు చవిచూశారని, మరో 20 ఏళ్ళ వరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దెదించడం ఎవరితరం కాదని రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. గురువారం అటవీ శాఖ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై ఇటీవల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అసలు ప్రాజెక్టు గురించి, నీటి పంపకాల గురించి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఏమి తెలుసని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర పేరిట హడావుడి చేస్తున్నారని, బస్సుయాత్ర ప్రజలకు నరకయాత్రగా మారిందన్నారు. బస్సుయాత్రను ప్రజలు ఏవగించుకుంటున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం మతిభ్రమించి మాట్లాడుతూ పోతున్నారని మంత్రి అన్నారు. గడ్డ పెంచుకున్న మాత్రానా ముఖ్యమంత్రి కాలేరని, 70 ఏళ్ళ పాలనలో చేసింది ఏమిలేకనే ప్రజలు గద్దెదించారని అన్నారు. గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములను టీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించడం విడ్డూరంగా ఉందని, ఎక్కడైనా భూములను లాక్కున్నట్లు నిరూపించాలని కాంగ్రెస్ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. 2014 తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూముల విషయంలో గిరిజనులకు పూర్తి హక్కులు కల్పించడం జరిగిందని, అడవుల చుట్టూ గుంతలు తవ్వి పశువులను రానివ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడవుల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, వర్షాకాలం ప్రారంభంలోనే కొత్త మొక్కలు పెరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, 2019లోపు జిల్లాలోని రైతులకు రెండు లక్షల ఎకరాలకు సా గునీరందించి తీరుతామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంబద్ద ప్రేలాపనలు మానుకోవాలని, తమ జోలికివస్తే ఖబడ్దార్ అంటూ మంత్రి హెచ్చరించారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, జిల్లా నాయకులు బాలూరి గోవర్దన్, జడ్పీటీసీ అశోక్, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల పాల్గొన్నారు.