భాష ముఖ్యం కాదు.. పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు అమ్మాయి అదితిరావు హైదరి పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా పెరిగింది మాత్రం నార్త్ ఇండియాలో. మోడలింగ్ నుండి హీరోయిన్‌గా ఎదిగిన ఈమె హిందీతోపాటు సౌత్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ సుధీర్‌బాబు సరసన నటిస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో అదితిరావు హైదరి చెప్పిన విశేషాలు..
సమ్మోహనం..
ఒకరోజు ఇంద్రగంటి ఫోన్ చేసి నాకు ఈ సినిమా గురించి చెప్పారు. ఐదు లైన్లలో కథ చెప్పారు. మొత్తం కథ విన్నాను. ఎలా విన్నానంటే పెద్దలు కథ చెబుతుంటే చిన్న పిల్లలు ఆసక్తిగా వుంటారు కదా.. అంత క్రమశిక్షణతో విన్నాను. చాలా నచ్చింది. కానీ నా దగ్గర కాల్షీట్లు లేవు. అయినా సర్ది ఈ సినిమా చేశాను. నా కోసం ఈ టీమ్ కొన్నాళ్లు ఆగారు. ఇక డబ్బింగ్ విషయంలో కూడా నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేను హైదరాబాదీనే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. మా తాత ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని చెప్పేవారు. కానీ నేను ఏ రోజు వాళ్ల మాట వినలేదు. డాన్సింగ్, సింగింగ్.. ఇలా చాలా నేర్చుకున్నాను కానీ నేనెప్పుడూ తెలుగు నేర్చుకోలేదు. ఈసినిమా కోసం నేర్చుకుని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
హీరోయిన్‌గా..
నేను చిన్నప్పటినుంచి హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలను చూస్తుండేదాన్ని. నిజ జీవితంలో హీరోయిన్‌గా చేస్తున్నాను. కానీ సెట్లో ఎలా వుండాలి? ఎలా ఉంటాను? వంటి విషయాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ సినిమా సమయంలో కాస్త అప్రమత్తంగా వాటి గురించి పట్టించుకున్నాను. హీరోయిన్లు చాలా కష్టపడతారు. వాళ్లవికాని ఎమోషన్స్‌ని మనసులో తెచ్చుకుని ప్రేక్షకులను రంజింపచేయడానికి కృషి చేస్తారు. ఆ కృషిని అభినందించాలి. అంతేగానీ హీరోయిన్లంటే కేవలం గ్లామర్ మాత్రమే చూడకూడదు. దాని వెనుక వున్న మనసును చూడాలి. మనలాంటి అమ్మాయిలే అని అందరూ అనుకోవాలి. నేనయితే స్ర్తి పురుషులంతా సమానమే అని అనుకుంటున్నాను. నన్ను మా వాళ్లు పెంచిన విధానం అలాంటిది. అలా కాకుండా అమ్మాయి కొంచెం తక్కువ అని ఎవరికైనా చిన్నప్పటినుంచి చెప్పి పెంచితే వారిలో ఎలాంటి మార్పూ రాదు.
కథలో కీలకంగా ఉంటేనే..
నేను హీరోయిన్‌నే. అయినా ఆర్టిస్టుని. నాకు కొంతమందితో పనిచేయాలని ఉంటుంది. అలాంటి దర్శకులు చెప్పే కథ ముందు వింటాను. కథ నచ్చితే మిగిలినవన్నీ సెకండరీనే. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉంటాను. దక్షిణాది మణిరత్నంగారితో సినిమా చేయాలన్నది నా కల. చేశాను. ఇప్పుడు ఆయనతో రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఆయన నాకు మెంటర్, టీచర్. ఒకటేంటి అన్నీ.. మనలోని ప్రతిభను బయటకు తీసుకురావడంలో ఆయన్ని మించిన వారు ఉండరు.
ఆ విషయాల గురించి..
నేను కలగన్న దర్శకుడితో పనిచేశాను. అంతకుమించిన ఆనందం ఏం ఉంటుంది? అయినా చెలియా సినిమా తెలుగులో సరిగా ఆడలేదేమో కానీ తమిళంలో ఆ సినిమా చాలా బాగా ఆడింది. అయినా నేను అంత త్వరగా నెగెటివ్ విషయాల గురించి ఆలోచించను. నా ముందు వంద రకాల నెగెటివ్ విషయాలున్నా, నేను ఎంపిక చేసుకునే అంశం నాకు సంతోషాన్ని కలిగించేదే అయి ఉంటుందనే నమ్మకం నాకు చాలానే ఉంటుంది.
తదుపరి చిత్రాలు..
సంకల్ప్ రెడ్డి సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉదయానే్న రోప్ వర్క్స్ నేర్చుకుంటున్నా. ఆ తర్వాత రాత్రి మణిరత్నం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నా. కష్టపడడం అలవాటైంది. వెనుక ఎంతైనా ఉండవచ్చు. కానీ నువ్వేంటనేది నువ్వే నిరూపించుకోవాలి అని చెప్పారు వాళ్లు. అందుకే నేను బాగా కష్టపడతాను.
*