అదిలాబాద్

సాత్నాల ద్వారా 24వేల ఎకరాలకు సాగునీరందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 21: ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు కింద గత ఏడాది 18వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేసినందునా ఈ ఏడాది అదనంగా 24వేల ఎకరాలకు సాగునీరందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి రామన్నతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తడి వాగు ఆయకట్టు వివరాలు పరిశీలించి కలెక్టర్ సాగునీటి విడుదలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పెన్‌గంగా ప్రాజెక్టు కింద బ్యారేజీల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని, దశల వారీగా పనుల అవసరాన్ని బట్టి నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. దహెగాం గ్రామంలో ముంపు బాధితుల పరిహారం కోసం ప్రభుత్వం తరుపున నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ మంత్రిని కోరారు. ఇందుకు గాను ప్రతిపాదనలు పంపించాలని, పరిహారం విషయంలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, సిఈ భగవంత్‌రావు, ఎస్‌ఈ హుస్సేన్ హమ్జాద్, ఆర్డీవో సూర్యనారాయణ, ఈఈ, డిఈ తదితరులు పాల్గొన్నారు.