అదిలాబాద్

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 21: ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు అన్నివిధాలుగా ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిఎం సహాయనిధి నుండి ఆర్థిక సాయాన్ని అందిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి తన నివాసంలో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నవారికి సిఎం సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సాయాన్ని అందజేశారు. 32మంది బాధితులకు రూ.కోటి 25లక్షల చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనారోగ్యానికి గురైన ప్రతీ ఒక్క నిరుపేదకు ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కమిషనర్, కౌన్సిలర్ల పరస్పర ఫిర్యాదులు
కాగజ్‌నగర్, జూన్ 21: మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు గురువారం రాత్రి కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పట్టణ సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కమిషనర్ తిరుపతి.. కులం పేరుతో తమను దూషించారని కౌన్సిలర్ చిందం శ్రీనివాస్‌తోపాటు మరో 17మంది కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం మధ్యాహ్నం జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం తన ఛాంబర్‌కు అనుమతి లేకుండా కౌన్సిలర్లు తాళం వేశారని కమిషనర్ ఫిర్యాదు చేయగా, కౌన్సిలర్లు చిందం శ్రీనివాస్‌తోపాటు విశే్వశ్వర్, బాల్క శ్యాం, జానీమీయా తదితరులు కమిషనర్ విధులు సక్రమంగా నిర్వహించడంలేదని అభివృద్ధి పనుల టెండర్లను పిలవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులను రెచ్చగొట్టి తమను దూషించేలా ప్రేరేపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదును స్వీకరించామని విచారణ జరిపి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. కౌన్సిలర్ల వెంట మున్సిపల్ చైర్‌పర్సన్, సిపి విద్యావతి, నాయకులు రాజ్‌కుమార్ ఉన్నారు.