అదిలాబాద్

నర్సరీల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 17: హరితహారం పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో నర్సరీల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు బాధ్యతగా పనిచేయాలని, మొక్కల పెంపకంపై దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. హరితహారం పథకం అమలులో భాగంగా 20516 సంవత్సరంలో నర్సరీల ద్వారా మొక్కలు పెంచుతున్న విధానంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మంచి అక్సిజన్‌తో పాటు నీడనిచ్చే మొక్కలను నాటి జిల్లావ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అందుకుగాను ఈ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ, సామాజిక వన విభాగం, డ్వామా, ఐటిడిఏ, సింగరేణి కాలరీస్ తదితర శాఖల ద్వారా 430 నర్సరీల ద్వారా 4కోట్లకు పైగా వివిధ రకాల మొక్కలు పెంచబడుతున్నాయన్నారు. నర్సరీలపై పర్యవేక్షణ జరపాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులపై ఉందని, వచ్చే సమావేశం నాటికి నర్సరీల పరిస్థితిపై నివేదికలు అందించాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి 40వేల మొక్కలు నాటడానికి లక్ష్యం నిర్ధేశించడం జరిగిందని, ఆ ప్రకారం జిల్లాకి అవసరమైన మొక్కలు పెంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వర్షాలు వచ్చేలోగా గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి గ్రామాల వారీగా కేటాయించిన నర్సరీలపై ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. హరితహారం పథకంలో ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జెసి సుందర్ అబ్నార్, ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.