ఫిట్నెస్ స్టూడియో ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నిత్యం పరుగులుపెట్టే నగర జీవితంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువని, అందుకే నగర ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. వ్యాయామాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రగతినగర్ యూసుఫ్‌గూడలో డాన్స్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాన్స్ ఇన్ డాన్స్ ఫిట్నెస్ స్టూడియోను తలసాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగర వాతావరణం మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కాలుష్యం బారిన పడుతున్నాం. మన జీవనశైలి ఒత్తిడితో కూడి ఉంటోంది. దీనికి తగినట్లే వ్యాయామాన్ని మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఫిట్నెస్ స్టూడియోలు ఆరోగ్య కేంద్రాలుగా మారాలి అని అన్నారు. డాన్స్ ఇన్ డాన్స్ స్టూడియో నిర్వాహకులు మాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమతో నాకు 20 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలకు పనిచేస్తూనే డాన్స్ ఫిట్నెస్ స్టూడియోలు నిర్వహిస్తున్నాను. మా ప్రధాన శాఖ ఎస్ఆర్నగర్లో ఉంది. ప్రస్తుతం ప్రగతినగర్ యూసుఫ్‌గూడలో కొత్త స్టూడియోను ప్రారంభించాం. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్గారి చేతుల మీదుగా మా డాన్స్ స్టూడియో మొదలవడం సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రగతినగర్ సమీపంలో ఇంత పెద్ద డాన్స్ స్టూడియో లేదు. మా డాన్స్ ఇన్ డాన్స్ స్టూడియోలో డాన్స్‌తోపాటు ఫిట్‌నెస్‌కు ఉపయోగపడే ఏరోబిక్స్, జుంబా లాంటి అనేక నృత్యరీతుల్లో శిక్షణ ఇస్తాం. నిష్ణాతులైన నిపుణులు మా స్టూడియోలో అందుబాటులో ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, వినోద్బాలా, కన్నారావు, ప్రముఖ కొరియోగ్రాఫర్లు సత్య, జానీ, శేఖర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.