శ్రీకాకుళం

బాబు బ్రహ్మాస్త్రం- కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 17 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన మేరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని బీజేపి నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రం విడిపోయే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలను కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర కావాలంటూ తప్పు దారి పట్టించారని పేర్కొన్నారు. విభజన నేపథ్యంలో ప్రజలు ఏం కోరినా ఇచ్చేందుకు ఆ నాడు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉండేదన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కావాలంటూ పట్టు పట్టడం తో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశించిన ఫలాలు అందలేదన్నారు. ఆనాడు నికర జలాలు, ఉమ్మడి ఆస్తులు, ఉద్యోగ విభజన వీటిలో ఏం కోరుకున్న అవి కేంద్రం ఇచ్చేదన్నారు. అలాంటి సందర్భాల్లో సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా చిత్రీకరించారన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమం వలన రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని గుర్తుచేసారు. సమైక్యాంధ్ర అంటూ స్వంత పార్టీ పెట్టుకునే ఉద్దేశ్యంతోనే ప్రజలను తప్పుతోవ పట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సి ఎం కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంలో అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయన తమ్ముడేమో తెలుగుదేశం పార్టీ లో ఉంటే కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి,కాంగ్రెస్ పార్టీకి కిరణ్‌కుమార్ రెడ్డి మధ్యవర్తిగా ఉంటారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనార్ధం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి వచ్చి పోలవరం ప్రాజెక్టులో పలు అనుమానాలు లేవనెత్తగా అక్కడి అధికారులు నీళ్లు నమిలారని గుర్తుచేశారు. మొదటి నుంచి బీజేపి పలు అంశాలపై అనుమానాలు లేవనెత్తుతుందో అనే అంశాలపై కేంద్ర మంత్రి అధికారులను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన విమర్శించారు.

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
* కలెక్టర్ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం, జూలై 17 : బాలికలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి కోరారు. బాలికలు చిన్నపటి నుండి పౌష్టికాహారం తీసుకోవాలని ఆయన సూచించారు. బరువు పెరుగుతామనే అపోహలు వదిలి ఇంట్లో లభించే తృణ ధాన్యాలు తీసుకోవడం వలన పౌష్టికాహారం అందుతుందని అన్నారు. అఫిషియల్ కాలనిలో గల ఎస్సి వసతి గృహంలో రెడ్‌క్రాస్ సౌజన్యంతో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎం రోజారాణి రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రక్తదానం చేసిన విద్యార్ధుల వద్దకు వెళ్లి ప్రేరణ కల్పించారు. వసతి గృహం విద్యార్ధులు మాత్రమే కాకుండా ప్రభుత్వ బాలికల కళాశాలలు విద్యార్ధినిలు సైతం రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రక్తదానంకు ముందుకు వచ్చిన విద్యార్ధినులను అభినందించారు. బాలికలు అందం లేదా , ఇతర అంశాల పై దృష్టి సారించి ఆహారం తీసుకోవడం లేదన్నారు. మంచి ఆహారం తీసుకోకపోవడం వలన భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. బాలికలకు గర్భాశయం పెరగకపోవడం వంటి అంశాలుంటాయని తద్వారా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యానికి గురికాగలరని ఆయన పేర్కొన్నారు. రక్తహీనత ప్రధానమైన సమస్యగా మారుతుందని అన్నారు. జిల్లాలో చిన్నారులు కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్ర్తిల్లో రక్తహీనత ఉందని ఆయన తెలిపారు. ఇందుకు పౌష్టికాహారం ఒక్కటే పరిష్కారమని అన్నారు. ఇంటి వద్ద లభించే శనగలు, నువ్వులు, బెల్లం లడ్డూలు ఉండలుగా చేసి తినడం వలన ఆరోగ్యానికి మంచిదన్నారు. చదివే విద్యార్ధులు అనవసర అపోహలకు గురుకారాదని మంచి ఆహారాన్ని తీసుకొని తగిన కసరత్తు చేయాలని పిలుపునిచ్చారు. బంగారు భవిష్యత్తు పొందాలని అందుకు ఆరోగ్యం ప్రధానమని అన్నారు. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బాలికల ఆరోగ్యం కుటుంబంలో అత్యావశ్యమని అన్నారు.
* అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అంటువ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని పేర్కొంటూ డెంగ్యూ వంటి వ్యాధులు సోకడం వలన రక్తంలో ప్లేట్‌లెట్స్ ఘననీయంగా తగ్గిపోతాయని తద్వారా ఆరోగ్యం చాలా క్షీనిస్తుందని అన్నారు. జిల్లాలో రక్తదానం ఇంకా పెరగాలని ఆయన పేర్కొన్నారు. గర్భిణీలు ప్రశవ సమయంలో ప్రమాదాలకు గురయ్యే వారు అంటువ్యాధులకు గురయ్యే వారికి జిల్లాలో రక్తం అవసరం ఉందని చెప్పారు. వ్యాధి బారిన పడిన వారికి తాజాగా తీసిన రక్తం అవసరం ఉంటుందని అది జిల్లాలో లభ్యంగా లేదని ఆయన అన్నారు. ప్రతీ మూడు నెలలకు రక్తాన్ని దానం చేయవచ్చని యువత మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ ఉపసంచాలకులు ఎం రోజారాణి మాట్లాడుతూ వసతి గృహ విద్యార్ధుల్లో ప్రేరణ కల్గించుటకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సి వసతి గృహ విద్యార్ధిని, విద్యార్ధులు మంచి నైపుణ్యం కలవారని వారిలో నైపుణ్యాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్ధ చైర్మన్ పి జగన్మోహన్‌రావు, ప్రతినిధులు చైతన్యకుమార్, నిక్కు హరిసత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆర్‌పిఎఫ్ శిక్షణకు ఈ నెల 20న ఎంపికలు
* కలెక్టర్ ధనంజయరెడ్డి
శ్రీకాకుళం(రూరల్), జూలై 17 : స్కిల్ డెవలప్‌మెంట్ కింద రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌లో శిక్షణ కోసం ఈ నెల 20వ తేదిన ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జిల్లాలో ఆర్ధికంగా సమాజికంగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కింద రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌కు శిక్షణ కోసం రక్షణ సెక్యూరిటి సర్వీసెస్( ఎ గ్రూప్ ఆఫ్ జి ఎం ఆర్ కంపెనీ) ద్వారా ఈ నెల 20వ తేదిన ఉదయం 10.30గంటలకు శ్రీకాకుళం బిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఈ ఎంపికలు జరుగుతాయని ఆయన తెలిపారు. కావున ఆసక్తి కలిగిన వెనుకబడిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు , కార్యనిర్వాహక సంచాలకులు, బిసి కార్పొరేషన్, డి ఆర్ డి ఎ కాంప్లెక్స్ కు హాజరుకావాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత సర్ట్ఫికేట్, కుల దృవీకరణ పత్రంలతో హాజరుకావల్సిందిగా ఆయన కోరారు. మరిన్ని వివరాలకు రక్షణ సెక్యూరిటి సర్వీసెస్ ఫోన్ నెంబర్ 9000452954 సంప్రదించాలన్నారు.

పంచాయతీ కార్యదర్శులకు బయోమెట్రిక్ మిషన్ల పంపిణీ
జలుమూరు,జూలై 17: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని మరింత పటిష్టవంతం చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామ స్థాయిలో ఈ విధానం అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం బయోమెట్రిక్ మిషన్‌లను ఎంపీడీవో పడాల వాసుదేవరావు అందజేసారు. ప్రతీదినం కార్యాలయంలో చేరినవెంటనే హాజరు తప్పక వేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ కార్యదర్శి తమ విధులను సూచాతప్పక పాటించి గ్రామస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, పలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నరసింహావతారంలో జగన్నాధుడు
జలుమూరు,.జూలై 17: మండల కేంద్రం జలుమూరు ప్రధాన రహదారి పక్కనున్న గుడించా మందిరంలోజగన్నాధుడు శ్రీనరసింహావతారంలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అతిధులు వైద్యభూషణ బానోజీరావు ప్రత్యేక పూజల అనంతరం పలు గ్రామాల ప్రజలు స్వామిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

కార్యాలయంలో మూలుగుతున్న టార్పాలిన్లు
సారవకోట,జూలై 17: మహాత్యాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులకు పనిచేసే స్థలంలో నీడ కల్పించే వీలుగా ప్రభుత్వం సరఫరా చేసిన టార్పన్‌లు గత కొన్ని నెలలుగా మండల పరిషత్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. గ్రామాల్లో గల శ్రమశక్తి సంఘాలకు ఒక టార్పెన్ చొప్పున ఉపాధి హామీ అధికారులు అందజేయవలసివుంది. వీటిని పంపిణీ చేయడంలో స్థానిక ఉపాధి హామీ అధికారులు నిర్లక్ష్యం చేసారు. దీని ఫలితంగా ఉపాధిహామీ వేతనదారులు పనిచేసే స్థలంలో వౌళిక సౌకర్యాలకు దూరమయ్యారు. కొంతమంది క్షేత్ర సహాయకులకు వారి పరిథిలో గల శ్రమశక్తి సంఘాలకు అందజేయాలని, పంపిణీ చేసిన టార్పెన్‌లను కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో భద్రపరిచారు. మండలంలో 736 శ్రమశక్తి సంఘాలుండగా 620 టార్పెన్‌లను జిల్లా అధికారులు సరఫరా చేసారని వీటిలో500 టార్పెన్‌లు వరకు సంబంధిత క్షేత్ర సహాయకులుకు అందజేసినట్లు ఏపీవో శశిభూషనరావు తెలిపారు. మండలంలోని ధర్మలక్ష్మీపురం పంచాయతీలో 22 సంఘాలుండగా కేవలం 5 సంఘాలకు చెందిన వేతనదారులకు మాత్రమే ప్రస్తుతం పనులు చేస్తున్నారని నవతల పంచాయతీల్లో 14 సంఘాలుండగా సుమారు 7 సంఘాలు పనిచేయడం లేదని ఆయన వివరించారు. మండల కేంద్రమైన సారవకోటలో 27 సంఘాలు పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయి క్షేత్ర సహాయకుడు లేనందున ఈ గ్రామంలో టార్పెన్‌లు పంపిణీ చేయలేదని స్పష్టం చేసారు. మండల పరిషత్ కార్యాలయంలో నిల్వయున్న టార్పెన్‌లను త్వరలో క్షేత్ర సహాయకుల ద్వారా శ్రమశక్తి సంఘాలకు అందజేస్తామన్నారు. పలు గ్రామ పంచాయతీల్లో భద్రపరిచిన టార్పెన్‌లను సంబంధిత శ్రమశక్తి సంఘాలకు అందేవిధంగా చర్యలు గైకొంటామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేసిన ఎన్ ఎంయు
పాలకొండ, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ ఎంయు నాయకులు ఒప్పందాలు చేసుకొని ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఐ ఆర్ ఇచ్చి కార్మికులకు అన్యాయానికి గురిచేసిందని ఇయు నాయకులు భాసూరు కృష్ణమూర్తి ఆరోపించారు. దీనికి నిరసనగా మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘమైన ఎన్ ఎంయు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యంతో చేసుకున్న చీకటి ఒప్పందం వల్ల ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆగస్టులో జరగబోవు గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఎన్ ఎంయుకు కార్మికులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ ధర్నాలో ఇయు డిపో అధ్యక్షులు ఎం.డి. అజీమ్, ఎం.వి. ఎస్.నారాయణ, జి. ఎస్.రావు, డిపో కార్యదర్శి డి.జి.రావు, ఎం. ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఒమ్మిలో గ్రామదర్శిని
రాజాం, జూలై 17: రాజాం మండలం ఒమ్మి గ్రామంలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజాం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గ్రీష్మాప్రసాద్ సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనలో భాగంగా సమీక్షించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీ ఏసీ ఎస్ అధ్యక్షులు వంగా గోవిందరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

బస్సు కోసం విద్యార్థులు ఆందోళన
రాజాం, జూలై 17: స్థానిక జీసీ ఎస్ ఆర్ కళాశాల కూడలిలో వంగర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు తమకు సమయానికి అనుకూలంగా బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ మంగళవారం ఆందోళన నిర్వహించారు. బస్సులను కొద్దిసేపు నిలిపివేసి నిరసన తెలిపారు. స్థానిక పోలీస్ యంత్రాంగం స్పందించి విద్యార్థులకు సర్దిచెప్పి ఆందోళన విరమింప చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు వివరిస్తామని హామీనివ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.