విజయవాడ

మరో మూడు రోజులు వడగాడ్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: జిల్లాలో మరో మూడు రోజులపాటు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులకు సూచించారు. రాష్టవ్య్రాప్తంగా తీర ప్రాంత జిల్లాల్లో రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించి తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని ఇదే రకమైన వాతావరణం మరో రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రజలకు ఎండ తీవ్రత తెలిపి నివారణ మార్గాలను ఆచరించేలా గ్రామాల్లో టాంటాం వేయించాలని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఎండ సమయంలో బయటకు రావలసి వస్తే సూర్య కిరణాలు నేరుగా శరీరంపై పడకుండా తలకు టోపీ, రుమాలు, గొడుగు ఉపయోగించుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తెల్లని కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆహార నియమాలు పాటించాలని, ఆకు కూరలు, పప్పు, పులుసు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మజ్జిగ, కొబ్బరి, కర్జూర పానీయాలు తీసుకోవాలన్నారు. కాచి, చల్లార్చిన నీటిని తీసుకోవాలని ప్రజలకు సూచించేలా గ్రామ గ్రామాన చాటింపుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వడదెబ్బ తగిలిన వారికి ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కోరారు.