మాస్ నుంచి సైన్స్‌కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ చిత్రాలతో అలరించిన హీరో రవితేజ తరువాతి ప్రాజెక్టులో సైన్స్‌ని టచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో బిజీగా ఉన్నాడు. దాదాపు సినిమా చిత్రీకరణ పూర్తికావొచ్చింది. ఆసక్తికరమైన మేకోవర్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే, ఇప్పటివరకూ మాస్ చిత్రాలపైనే దృష్టిపెట్టిన రవితేజ తదుపరి ప్రాజెక్టులో సైన్స్ కంటెంట్‌ను టచ్ చేయబోతున్నాడట. దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ నచ్చడంతో, ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. వైవిధ్యమైన కథావస్తువును ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఐ ఆనంద్‌ది ఓ స్టయిల్. అలా ‘టైమ్ మిషన్’ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధం చేసిన కథ రవితేజకు కనెక్టైందని ఇండస్ట్రీ టాక్. నిజానికి బాలకృష్ణ ఆదిత్య 369, సూర్య 24 చిత్రాలు ఇలాంటి సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చినవే. అయితే విఐ ఆనంద్ రాసుకున్న కథ మరో కోణాన్ని స్పశిస్తుందని, అందుకే రవితేజ ఓకే చేశాడని అంటున్నారు. హీరోయిన్‌గా నభా నటేశ్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో, డిసెంబర్‌లో ప్రాజెక్టు లాంచ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.