వర్మ.. లక్ష్మీస్ సెనే్సషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు వర్మ తాజాగా మరో నిజమైన సంచలనానికి తెర తీసాడు. కొద్దిరోజుల క్రితం ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తాలూకు కీలక అప్‌డేట్‌ను ట్వీట్ చేసిన వర్మ, నిన్న చెప్పినట్టుగానే తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని లడ్డూతో ఫొటోలకు ఫోజులిచ్చేశాడు. నాస్తికవాదాన్ని సమర్థించే వర్మ ఇలా తిరుపతికి రావడం ఇదే తొలిసారి. దీని గురించిన స్పష్టతతోపాటు లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి చేసిన ఒక వీడియో ఏవీవీ ఓపెన్ ఛాలెంజ్ పేరుతో వర్మ విడుదల చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో వర్మ చెప్పిన మాటలు, చేసిన హెచ్చరిక రానున్న రోజుల్లో పుట్టబోయే సెగలను ముందే రుచి చూపిస్తున్నట్టుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఇస్తున్న ఘన నివాళి. ఎవరెన్ని పేర్లతో ఎన్ని రకాలుగా ఆయన కథను సినిమా చేసినా, పైనున్న అన్న ఆశీస్సులు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కే ఉంటాయి. ఇది ఓపెన్ ఛాలెంజ్’ అంటూ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో సెనే్సషన్‌గా మారింది. పరోక్షంగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనన్న చర్చ పరిశ్రమలో మొదలైంది. ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత జరిగిన ఘట్టాలను తీసుకుని, అప్పుటి కీలక పరిణామాలను ప్రపంచానికి చాటిచెప్పడమే తన ఉద్దేశమంటూ వర్మ వీడియోలో ప్రకటించడం గమనార్హం. పైగా టైటిల్ కింద ట్యాగ్‌లైన్ ‘అసలు కథ’ అని పెట్టడం చూస్తే వర్మ వచ్చే ఎన్నికల నాటికి ఓ రేంజ్ చిచ్చు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈరోజు లక్ష్మీపార్వతితో కలిసి మరీ ఏడుకొండల వాడిని దర్శించుకున్న వర్మ, మీడియాముందు ఇంకెలాంటి చాలెంజ్‌లు విసురుతాడోనన్న ఆసక్తి కనిపిస్తోంది.