‘9000 కెఎంపిహెచ్’ స్పీడ్‌తో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి స్పేస్ నేపథ్యంతో వస్తున్న సినిమా ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కాగా దీపావళి సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమా ‘ఘాజి’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. వరుణ్‌తేజ్, బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరిలు వ్యోమగాములుగా నటిస్తుంటే, ఇటీవలే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాను దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డిలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు.