అంతర్జాతీయం

1.5 ట్రిలియన్ సౌర ద్రవ్యరాశులతో సమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, మార్చి 8: మన పాలపుంత గురించి సౌరవ్యవస్థ ఆవల ఉన్న కోటానుకోట్ల నక్షత్ర మండలంలో వెలుగుచూసే ప్రతి విషయం అబ్బురపరిచే అవుతుంది. తాజాగా హబుల్ టెలిస్కోప్, ఐరోపా స్పేస్ ఏజన్సీకి చెందిన గాయియా పరిశోధనలో పాలపుంతకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. దీని బరువు 1.5 ట్రిలియన్ సౌర ద్రవ్యరాశులతో సమానమని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు పాలపుంతపై ఎన్నో పరిశోధనలు జరిగినా దీని బరువు ఎంత దానిపై భిన్నమైన కథనాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన పరిశోధన పాలపుంత బరువెంతో చూచాయగా నిర్థారించింది. ఇప్పటివరకు హబుల్ టెలిస్కోప్, ఐరోపా స్పేస్ ఏజన్సీ అందుబాటులోకి తెచ్చిన వివరాలను క్రోడీకరించి ఖగోళవేత్తలు ఈ నిర్థారణకు వచ్చారు. గతంలో ఇందుకు సంబంధించిన అనేక అధ్యయనాలు వచ్చాయి. పాలపుంత బరువు లేదా ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశిలో 500 బిలియన్‌ల నుంచి 3 ట్రిలియన్ రెట్లు ఉండవచ్చునని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. దీంతో ఖగోళవేత్తల్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. నక్షత్ర మండలంలో దాదాపు 90 శాతం వరకు ఉన్న శూన్య పదార్థ అంచనాకు భిన్న పద్ధతులు అనుసరిస్తూ వచ్చారు. ఆ పద్ధతిలోనే పాలపుంత ద్రవ్యరాశికి అన్వయించడం వల్ల ఈ తారతమ్యం ఏర్పడిందని జర్మనీకి చెందిన శాస్తవ్రేత్త లారా వాక్పిన్స్ తెలిపారు. నక్షత్ర సమూహాలు అలాగే అనంత దూరంలో ఉన్న నక్షత్ర వలయాలను, వాటి ద్రవ్యరాశిని పరిగణనలోకి తీసుకుని పాలపుంత బరువుపై ఈ అంచనా వేసినట్టు తెలిపారు. ఒక నక్షత్ర మండల ద్రవ్యరాశి ఎంత విస్తృతంగా ఉంటే దాని చుట్టూ ఉండే నక్షత్ర సమూహాలు అంతగానూ దాని గురుత్వాకర్షక ప్రభావానికి లోనవుతాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మరో శాస్తవ్రేత్త విన్ ఇవాంగ్స్ తెలిపారు.