అప్పుడే.. నటనకు గుడ్‌బై!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా వస్తున్న లాల్‌సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు. సినిమా.. సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకునే అమీర్.. నటనకు ఎపుడు గుడ్‌బై చెప్తాడో స్వయంగా వెల్లడించాడు. ఇటీవలే మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో అమీర్ మాట్లాడుతూ.. సినిమాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంవల్లే తారేజమీన్‌పర్ చిత్రంతో దర్శకుడిగా మారా. నటనలో నా ప్రయాణం ఇపుడే మొదలైనట్లు అనిపిస్తోంది. నేను పూర్తిస్థాయి దర్శకుడిగా మారాక నటనకు గుడ్‌బై చెప్పేస్తానన్నాడు. అమీర్ చేయనున్న కొత్త ప్రాజెక్టుకోసం ఏకంగా 20 కిలోల బరువు తగ్గనున్నాడు. ఇందులో లాల్‌సింగ్ పాత్రలో కనిపించనున్నాడు.