అంతర్జాతీయం

టీవీ ఎక్కువగా చూస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 4: ‘మీలో ఎవరైనా గంటల తరబడి కూర్చొని టీవీ చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీకు హృద్రోగ సంబంధ వ్యాధులు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉంది’. ఉద్యోగంలో ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్న వారి కన్నా గంటల తరబడి అదే పనిగా టీవీ చూస్తున్న వారిలోనే గుండె సంబంధ వ్యాధులు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది. అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీ ఈ సర్వేను నిర్వహించింది. దాదాపు మూడు వేల 592మందిపై ఎనిమిదిన్నర సంవత్సరాల పాటు నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడైనట్లు అధ్యయనం పేర్కొంది. ఉద్యోగ రీత్యా ఎక్కువ పనిగంటలు కూర్చొని పనిచేసిన వారు వ్యాయామం బాగా చేయడం ద్వారా గుండె సంబంధ రోగాల నుంచి బయటపడే అవకాశం ఉందని అధ్యయన రచయిత కీత్ ఎం రియాజ్ వెల్లడించారు. ఉద్యోగ రీత్యా ఎన్ని పని గంటలు పనిచేస్తున్నారో.. ఎన్ని గంటలు టీవీ చూస్తున్నారని అంశాలను సర్వేలో పాల్గొన్నవారు వివరించారని రియాజ్ చెప్పారు. అలాగే, వీరు ఎంతవరకు వ్యాయామం చేస్తున్నారో కూడా వెల్లడించారని పేర్కొన్నారు.