విజయవాడ

మర్యాదగా మాట్లాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 24: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మాట్లాడాలని, నవ్వుతూ ఓపికతో పలకరించి న్యాయం చేసేందుకు చొరవ చూపాలని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల రిసెప్షన్ సిబ్బందికి పోలీసు కమాండ్ కంట్రోల్ రూంలో శనివారం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఓపికతో వినాలని, బాధితులతో నవ్వుతూ మర్యాదగా సంబోధించాలని, ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు రాతపూర్వకమైన రశీదు ఇవ్వాలన్నారు. రిసెప్షన్ సిబ్బంది చట్టాలపై తగు అవగాహన పెంచుకోవాలని, సిటిజన్స్ కస్టమర్‌గా భావించి బాధ్యతాయుతమైన సేవలు అందించాలన్నారు. అందరికీ సత్వర న్యాయం జరిగేలా సిటిజన్ యాజ్ కస్టమర్ పేరుమీద ఒకరోజు వర్క్‌షాపు ప్రతి పోలీసు కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ అధికారి వరకు ప్రతి ఆదివారం 50 మంది చొప్పున నగరంలోని సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కమిషనరేట్‌లోని 43మంది రిసెప్షన్ సిబ్బంది హాజరుకాగా, సిద్ధార్థ ఫ్యాకల్టీ కే మహేష్, చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ అరవ రమేష్, రిటైర్డ్ ఎస్‌ఐ జే దుర్గారావు, గేట్‌వే హోటల్ జీఎం రాధిక, డీసీపీలు కోటేశ్వరరావు, విజయారావు, ఏసీపీ ఎం రమేష్ పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.