కొత్తేంకాదుగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సంక్రాంతి సినిమా -రాములో రాములా. ప్రాజెక్టుకు సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్. ఈ సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం బయటికిచ్చిన ‘సామజవరగమన’ సంచలనమైతే, -దీపావళి రోజున పార్టీ పాటగా వచ్చిన ‘రాములో రాములా..’ మరో సెనే్సషన్ క్రియేట్ చేసింది. హ్యాట్రిక్ ప్రాజెక్టుకు తమన్ మ్యూజిక్ బిగ్ అస్సెట్ అంటూ ప్రశంసలూ వచ్చేశాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, తాజాగా సోషల్ మీడియాలో రెండోకోణం వైరల్ అవుతోంది. అది -అ.వై ప్రాజెక్టు కోసం థమన్ చేసిన పార్టీ సాంగ్ అతని క్రియేషన్ కాదన్నది. గత ఫిబ్రవరిలో యూట్యూబ్ ట్రెండింగ్‌లోవున్న ప్రయివేట్ పాటల్లో ‘వరంగల్ చెరువు’ ఒకటి. థమన్ కాపీ కొట్టిన సాంగ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో మరోసారి పాటను ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజనులు. పల్లవిలోని రెండు లైన్ల ట్యూన్‌ను తీసుకుని.. దానిచుట్టూ మిగిలిన పాట కట్టిఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. కాపీ అనుకున్నా, ఇన్‌స్పైర్ అనుకున్నా.. నచ్చింది తీసుకోవడం థమన్‌కు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆరోపణలపై థమన్ ఇంతవరకూ పెదవి విప్పలేదు. సంబంధం లేదని సరిపెట్టేస్తే ఓకే.. లేదంటే బన్నీ హ్యాట్రిక్ సినిమా మీద ఇదో మచ్చనుకోవాలి.