యాక్షన్‌కు కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు యాక్షన్ సినిమాలపై పేటెంట్ రైట్స్ తీసుకున్న దర్శకుడు -బోయపాటి. సినిమా ఏదైనా -స్టంట్స్‌కి మాత్రం కొదవుండదు. అలాంటి బోయపాటి -పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాడట. బాలయ్యతో చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టులో యాక్షన్ సీక్వెన్స్‌కు భారీ కోత పెడుతున్నారన్నది తాజా సమాచారం. బోయపాటి లాస్ట్ ప్రాజెక్టు -వినయ విధేయ రామ. సినిమాలో యాక్షన్ శృతిమించింది. ఊహకందని స్టంట్ సీనే్స సినిమా పరాజయానికి కారణమైంది. ఎన్ని హిట్లుపడినా ఒక్క ఫ్లాప్ దర్శకుడి కెరీర్‌ని కిందకు దింపేస్తుందన్నట్టు -బోయపాటికి మళ్లీ సినిమా దక్కడానికి చాలకాలమే పట్టింది. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న బోయపాటి -బాలయ్య హీరోగా చేయనున్న సినిమాలో యాక్షన్‌పాళ్లు హద్దులు దాటకుండా స్క్రిప్ట్ దశలోనే కోతలు వేసేస్తున్నాడట. బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్న సినిమా -వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.