లుక్కిచ్చిన బుజ్జీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జోడీగా సత్యసాయి ఆర్ట్స్‌పై దర్శకుడు కొండా విజయ్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -ఒరేయ్ బుజ్జిగా. కెకె రాధామోహన్ నిర్మిస్తోన్న వేసవి సినిమా షూటింగ్ పూరె్తైన నేపథ్యంలో, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ -సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ దశకు చేరుకుంది. రాజ్‌తరుణ్ వైవిధ్యమైన పాత్ర పోషించిన సినిమా యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్ టైగర్, పంతం వంటి చిత్రాల తర్వాత తమ సంస్థలో రూపొందిన సినిమా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని మసాలాలు అందిస్తుందని, కమర్షియల్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. హెబ్బాపటేల్ కీలక పాత్ర పోషిస్తోన్న చిత్రంలో వాణీవిశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిల్లా, సప్తగిరి, సత్య, మధునందన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.