తూర్పుగోదావరి

కొత్తపేటలో మరో ఆవు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, ఏప్రిల్ 28: విషాహారం కారణంగా కొత్తపేటలో మరో ఆవు మృతి చెందటంతో మృతి చెందిన ఆవుల సంఖ్య గురువారానికి మూడుకు చేరుకుంది. పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న అధికార్లు ఆవుల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కొత్తపేటకు చెందిన చింతపల్లి శ్రీనివాస్‌కు చెందిన గోశాల ఆవులకు విషగుళికలు పెట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. మొత్తం ఆరు ఆవులు ఈ విషాహారాన్ని తినగా అందులో మూడు ఆవులు మృతి చెందగా మరో మూడు ఆవులకు స్థానిక పశువైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. తహసీల్దార్ ఎన్ శ్రీ్ధర్ విషాహారం తిన్న ఆవులను పరిశీలించారు. అలాగే బిజెపి నాయకులు కూడా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఇలావుండగా విషాహారం కారణంగా మృతి చెందిన ఆవులకు తహసీల్దార్ శ్రీ్ధర్, ఎస్‌ఐ డి విజయ్‌కుమార్‌ల పర్యవేక్షణలో పశువైద్య అధికార్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు కారకుడైన గంగుమళ్ళ శ్రీరామచంద్రమూర్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.