విశాఖ

సైకిలెక్కిన కిడారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టిడిపిలో చేరే ప్రక్రియ లాంఛనంగా పూర్తయింది. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో గురువారం ఆయన తన అనుచరులతో కలసి టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి అనుచరులు సైతం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కిడారి చేరిక ద్వారా విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో వైకాపా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. తెలుగుదేశంపార్టీ అమలు చేస్తున్న ఆకర్ష్‌కు కిడారి రూపంలో తొలి ఎమ్మెల్యే వైకాపా నుంచి పార్టీ ఫిరాయించారు. కిడారి, బాబ్జి చేరికపై గత కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ తమ రాజకీయ గురువు కొణతాల రామకృష్ణ ఆదేశాల కోసం ఎదురుచూస్తూ వచ్చారు. గురువుతోపాటు పార్టీ మారాలనుకున్న వీరు ఒక విధంగా ముందడుగు వేసారనే చెప్పాలి. కొణతాల తెలుగుదేశంలో చేరికపై సందిగ్ధం నెలకొన్న నేపధ్యంలో శిష్యులు ఇద్దరు సొంత నిర్ణయమే మేలని భావించారు. ఎట్టకేలకు కిడారి,బాబ్జి తమ అనుచరులతో విస్తృత మంతనాలు జరిపి వారిని ఒప్పించి పార్టీ మారారు. ఇలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా విజయం సాధించలేదు. దీంతో గిరిజన సంక్షేమశాఖను రావెల కిషోర్‌బాబుకు అప్పగించారు. భవిష్యత్‌లో అవకాశం ఉంటే మంత్రి పదవి, లేనిపక్షంలో జిసిసి చైర్మన్ గిరి కిడారికి ఇవ్వాలన్న నిబంధనతోనే ఆయన్ని పార్టీలోకి చేర్చుకున్నట్టు సమాచారం. మరోవైపు విశాఖ ఏజేన్సీలో వేల కోట్ల రూపాయల బాక్సైట్ ఖనిజ నిక్షేపాల తవ్వకం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఎదురవుతోన్న చిక్కులను తొలగించుకోవాలంటే ఈ ప్రాంతానికి చెందిన గిరిజన ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. తొలి విడతగా కిడారి సర్వేశ్వరరావును పార్టీలోకి చేర్చుకుని బాక్సైట్ ఉద్యమాన్ని అణగదొక్కే ఎత్తుగడకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారని వైకాపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.