తూర్పుగోదావరి
బీచ్ రోడ్డు విస్తరణకు కసరత్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 May 2016
యు కొత్తపల్లి, మే 10: ఉప్పాడ - కోనపాపపేట - కాకినాడ బీచ్ రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడానికి కసరత్తు ప్రారంభమైంది. దీనిలో భాగంగా బీచ్ రోడ్డులో మట్టి నమూనా పరిశీలన ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఉప్పాడలో సముద్రం ఉన్న ప్రాంతం వద్ద సుమారు 12 చోట్ల మట్టి నమూనా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప్పాడ, కోనపాపపేట, కాకినాడ బీచ్ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణతోపాటు సముద్ర కెరటాలు ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మించడానికి మట్టి నమూనా పరిశీలన జరుగుతోందన్నారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టే రోడ్డు పనులు, ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రైవేటు ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు.