సోనమ్... ఆల్ ది బెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 May 2016
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/16sonam.jpg?itok=npvYM7di)
ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ ఉత్పత్తుల సంస్థ లారియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ ఈసారి కేన్స్‌లో అంతా కలసివస్తుందంటున్నాడు ఆమె తండ్రి, బాలీవుడ్ అలనాటి నటుడు అనిల్‌కపూర్. ఇప్పటికే కేన్స్ చేరుకున్న సోనమ్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పాడు. ‘కేన్స్-2016 నీకు ఎంతో బాగుంటుంది’ అని ట్వీట్ చేశాడు. లారియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటివరకు ఐదుసార్లు కేన్స్‌కు హాజరైన సోనమ్ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ను సాధించింది. ఇప్పుడు ఆరోసారి కేన్స్‌కు హాజరైన ఆమె సోమ, మంగళవారాల్లో రెడ్‌కార్పెట్‌పై సందడి చేయనుంది. బాలీవుడ్ తారలు ఐశ్వర్య, కత్రినాకూడా లారియల్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.